HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pm Modi Makes Sensational Remarks About Sanju

సంజుపై ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM NARENDRA MODI ON SANJU SAMSON
PM NARENDRA MODI ON SANJU SAMSON

PM NARENDRA MODI ON SANJU SAMSON  టీమిండియా స్టార్ బ్యాటర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆటతీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ చూపిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసేవాడే నిజమైన ఆటగాడని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… “ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది. కేరళ ప్రజలు కూడా సంజూ శాంసన్ ప్రదర్శన నుంచి నేర్చుకోవాలి. ప్రపంచకప్‌లో శాంసన్ ఆటతీరును మనం చూశాం. టోర్నమెంట్‌లో కీలకమైన నాకౌట్ దశ వచ్చినప్పుడు, అతని ప్రదర్శన ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరింది. టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకు అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉన్నాయి. జట్టుకు అతని అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇదే నిజమైన ఆటగాడికి ఉండాల్సిన లక్షణం” అని తెలిపారు.

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్‌తో 321 పరుగులు సాధించి “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును గెలుచుకున్నాడు. ఇందులో 27 ఫోర్లు, 24 సిక్సులు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (2014లో 319 పరుగులు) రికార్డును శాంసన్ అధిగమించాడు.

టోర్నీ ఆరంభంలో రెండు మ్యాచ్‌లలో పెద్దగా రాణించకపోయినా, సూపర్-8 దశ నుంచి శాంసన్ చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై మరో 89 పరుగులతో జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 T20 World Cup
  • indian cricket
  • Kerala Elections
  • narendra modi
  • NDA government PM Modi
  • Sanju Samson
  • sports news

Related News

PM Modi extends massive support to earthquake-hit Venezuela; India ready to provide assistance.

Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి

భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… విపత్తు బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహక

  • Discussion on a reshuffle in Modi's cabinet?

    PM MODI: మోదీ కేబినెట్ లో మార్పుపై చర్చ?

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd