IND vs AUS: ప్రారంభమైన నాలుగో టెస్టు.. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన మోదీ, అల్బనీస్..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
- Author : Gopichand
Date : 09-03-2023 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న తొలిరోజు మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వీక్షించనున్న ఈ మ్యాచ్ ఇరు దేశాలకు చాలా ప్రత్యేకం. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానూలు ప్రత్యేక రథంపై కూర్చొని స్టేడియంను చుట్టి వచ్చారు.
అంతకుముందు, ఇరు దేశాల ప్రధానులు ఉదయం 8:30 గంటలకు స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ వారికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా స్వాగతం పలికారు. రెండు దేశాల ప్రధాని దాదాపు 2 గంటల పాటు స్టేడియంలోనే ఉండొచ్చు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కామెంటేటర్ రవిశాస్త్రి ప్రధానులిద్దరికీ వివరించి చెప్పారు. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరపున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆసీస్ ప్రధానికి జ్ఞాపిక అందజేశారు.
Mr. Roger Binny, President, BCCI presents framed artwork representing 75 years of friendship through cricket to Honourable Prime Minister of Australia Mr. Anthony Albanese#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Qm1dokNRPY
— BCCI (@BCCI) March 9, 2023
ఈ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. భారత జట్టు ఇప్పటికీ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. దీనిలో మొదటి 2 మ్యాచ్‌లలో ఏకపక్ష విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమ్ ఇండియా తన పట్టును నిలుపుకుంది. అదే సమయంలో ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది.
టాస్ గెలిచిన ఆసీస్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి, నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా సిరీస్‌ను సమం చేసుకోవాలని ఆసీస్ చూస్తుంది.