Asia Cup Schedule: గెట్ రెడీ.. నేడు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల..!
మంగళవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup Schedule)ను బుధవారం విడుదల చేయనున్నట్లు ఈ పత్రికా ప్రకటనలో తెలిపారు.
- By Gopichand Published Date - 06:41 AM, Wed - 19 July 23

Asia Cup Schedule: మంగళవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup Schedule)ను బుధవారం విడుదల చేయనున్నట్లు ఈ పత్రికా ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. మీడియా కథనాల ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45 గంటలకు ఆసియా కప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అంతకుముందు శనివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ మధ్య సమావేశం జరిగింది. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
టోర్నీలో తొలి మ్యాచ్ ఆగస్టు 31న జరగనుంది.
ఆసియా కప్ 2023 మొదటి మ్యాచ్ ఆగస్టు 31న జరగనుంది. అదే సమయంలో ఆసియా కప్ టైటిల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో 4 మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. నిజానికి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకలో అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు సత్తా చాటిందని ఆసియా కప్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆసియా కప్‌లో అత్యధికంగా 6 సార్లు టైటిల్‌ను గెలుచుకున్న జట్టు టీమిండియా కాగా శ్రీలంక జట్టు 5 సార్లు టోర్నీ విజేతగా నిలిచింది.
Also Read: Fastest Badminton Smash: అమలాపురం కుర్రాడి సూపర్ స్మాష్… సాత్విక్ దెబ్బకు గిన్నిస్ రికార్డ్ బ్రేక్
టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడనున్నారు.
ఇటీవల పాకిస్తాన్ క్రీడా మంత్రి అహ్సాన్ మజారీ మాట్లాడుతూ.. 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి, టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ గడ్డపై ఆడాలని అన్నారు. తమకు హైబ్రిడ్ మోడల్ అక్కర్లేదని కూడా చెప్పాడు. అయితే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే, వన్డే ప్రపంచకప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు వెళ్లదని అన్నాడు. ఇప్పుడు బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే టీం ఇండియా తన మ్యాచ్ లను పాకిస్థాన్‌కు బదులుగా శ్రీలంక గడ్డపై ఆడనుంది.