Indian Flag: ఛాంపియన్స్ ట్రోఫీలో జెండా వివాదం.. క్లారిటీ ఇచ్చిన పీసీబీ!
పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి. ఇప్పుడు నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఈ మూడు ప్రదేశాలలో భారత జెండా కనిపించని అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 11:15 AM, Tue - 18 February 25

Indian Flag: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెండాను (Indian Flag) ఎగురవేయకపోవడంపై వివాదం చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్ కరాచీ స్టేడియం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భారతదేశం మినహా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు ప్రదర్శించారు. ఇప్పుడు ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి పెద్ద ప్రకటన వెలువడింది.
పీసీబీ నుంచి ప్రకటన వెలువడింది
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమిండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇదే సమయంలో ఇప్పుడు కరాచీ స్టేడియంలో భారత జెండా లేకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ విషయానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి ఈ సూచన వచ్చిందని, మ్యాచ్ రోజులలో నాలుగు జెండాలు మాత్రమే ఎగురవేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Also Read: SBI Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 250తో ప్రారంభం!
పీసీబీ అధికారి హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. “ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మ్యాచ్ రోజులలో నాలుగు జెండాలు మాత్రమే ఎగురవేయాలని ICC సూచించింది. ఇందులో ICC (ఈవెంట్ అథారిటీ), పాకిస్థాన్ (ఈవెంట్ హోస్ట్), ఆ రోజు మ్యాచ్ ఆడే రెండు జట్ల జెండాలు ఉంటాయి” అని ఆయన తెలిపారు.
భారత జెండాను పాకిస్థాన్ ఎగురవేయదు
పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి. ఇప్పుడు నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఈ మూడు ప్రదేశాలలో భారత జెండా కనిపించని అవకాశం ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ బృందం కరాచీ, లాహోర్ లేదా రావల్పిండిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడటంలేదు.
ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న ఆతిథ్య పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.