Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయస్ అయ్యర్!
వేలం సమయంలో ఒక జట్టు టేబుల్‌పై గరిష్టంగా 8 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని ఫ్రాంఛైజీలు ఈ సభ్యుల పేర్ల జాబితాను ముందుగానే బీసీసీఐకి పంపాలి.
- Author : Gopichand
Date : 10-12-2025 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Shreyas Iyer: బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత సీజన్ ఫైనలిస్ట్ అయిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వేలం టేబుల్‌పై కనిపించనున్నారు. బలమైన జట్టును నిర్మించే బాధ్యతను అయ్యర్ ఇప్పుడు స్వయంగా తీసుకున్నారు. అయితే ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ తమ కోచ్ రికీ పాంటింగ్ సేవలను మిస్ కానుంది. మినీ వేలానికి ముందు పాంటింగ్ వేలం నుంచి తప్పుకోవడమే దీనికి కారణం.
Also Read: WiFi Password: వై-ఫై పాస్వర్డ్ మార్చడం లేదా? అయితే ప్రమాదమే!
వేలం టేబుల్లో శ్రేయస్ అయ్యర్
క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ టేబుల్‌పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయ్యర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆయన టేబుల్‌పై కూర్చునే అవకాశం ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం టేబుల్లో కనిపించరు. పాంటింగ్ ప్రస్తుతం యాషెస్ 2025-26 సిరీస్‌లో కామెంటరీ చేస్తూ బిజీగా ఉన్నారు. అందువల్ల ఆ సిరీస్ నుంచి అతనికి విరామం లభించదు. అందుకే ఆయన ఆస్ట్రేలియా నుంచే తన జట్టుకు సహాయం చేస్తారు. వేలం సమయంలో ఒక జట్టు టేబుల్‌పై గరిష్టంగా 8 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని ఫ్రాంఛైజీలు ఈ సభ్యుల పేర్ల జాబితాను ముందుగానే బీసీసీఐకి పంపాలి.
డేనియల్ వెట్టోరీ వేలంలో పాల్గొంటారు
న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెట్టోరీ మాత్రం వేలంలో పాల్గొననున్నారు. ఈ విషయం గురించి ఆయన ఆస్ట్రేలియా జట్టుతో (ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో కోచ్‌గా పనిచేస్తున్నారు) మాట్లాడి అనుమతి తీసుకున్నారు. గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాబట్టి ఈసారి వేలం టేబుల్‌పై కూర్చుని, గత సీజన్‌లోని లోపాలను సరిదిద్దడానికి వెట్టోరీ పూర్తి ప్రయత్నం చేస్తారు. మిగతా జట్ల విషయానికొస్తే వాటి సపోర్ట్ స్టాఫ్, మేనేజ్మెంట్ సభ్యులు మాత్రమే వేలం టేబుల్‌పై కనిపిస్తారు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఇకపై కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభిమానులు డిసెంబర్ 16 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.