HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Notices To Team India Players

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

  • Author : Vamsi Chowdary Korata Date : 09-05-2026 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma
Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది.

నాడా నిబంధనల ప్రకారం ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)’లో ఉన్న క్రీడాకారులు తాము డోప్ పరీక్షల కోసం అందుబాటులో ఉండే ప్రదేశం, ఒక గంట సమయం గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలి. అయితే, 2025 నవంబర్ 7న డోపింగ్ కంట్రోల్ అధికారులు శాంపిల్ సేకరణకు వెళ్లినప్పుడు షఫాలీ వర్మ తాను పేర్కొన్న ప్రదేశంలో లేరు. అలాగే, 2025 డిసెంబర్ 17న యశస్వి జైస్వాల్ కూడా అందుబాటులో లేనట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనల అనంతరం 2026 ఫిబ్రవరిలో ‘నాడా’ వారి నుంచి వివరణ కోరినప్పటికీ, ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా దీన్ని అధికారికంగా ‘మిస్డ్ టెస్ట్’గా నమోదు చేసింది. ప్రస్తుతం తమ గైర్హాజరుకు సరైన కారణం చెప్పేందుకు ఇద్దరికీ ఏడు రోజుల తుది గడువు ఇచ్చింది.

యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడుసార్లు ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్స్’కు పాల్పడితే, దానిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువై, క్రీడాకారులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోతే, రెండేళ్ల వరకు నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం జైస్వాల్, షఫాలీలకు ఇది మొదటి తప్పిదం అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

గతంలో 2019లో భారత బ్యాటర్ పృథ్వీ షాపై ఇలాంటి కేసులోనే నాడా 8 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దగ్గు మందులో ఉన్న టెర్బుటాలిన్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తెలియకుండా తీసుకున్నట్లు అప్పట్లో బీసీసీఐ వాదించింది. ఈ నేపథ్యంలో యువ క్రీడాకారులు డోపింగ్ నిబంధనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti Doping Agency
  • BCCI
  • Cricket India
  • cricket news
  • Doping Test
  • NADA
  • Shafali Verma
  • yashasvi jaiswal

Related News

Who is Team India's new T20 captain?

T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

  • Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

  • Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd