Virat Kohli: విరాట్ కోహ్లీకి చురకలు అంటించిన టీమిండియా మాజీ ఆటగాడు.. ఏమన్నారంటే..?
ఆరంభం నుంచి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే సత్తా జైస్వాల్ కు ఉందని చెప్పాడు
- By Sudheer Published Date - 03:56 PM, Sat - 15 June 24

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో కెనడాతో భారత్ గ్రూప్ A మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ S శ్రీశాంత్ మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ ప్రారంభించడాన్ని చూడాలనుకుంటున్నాను. ఆరంభం నుంచి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే సత్తా జైస్వాల్ కు ఉందని చెప్పాడు. న్యూ యార్క్‌లోని డ్రాప్-ఇన్ పిచ్‌లపై భారత తొలి మూడు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా విరాట్ కోహ్లి (Virat Kohli) 1, 4, 0 పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయాలనే డిమాండ్ పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
డిస్నీ + హాట్‌స్టార్‌లో ‘క్యాట్ అండ్ బోల్డ్’ షోలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. నేను యశస్వి జైస్వాల్ మ్యాచ్‌ని ప్రారంభించడాన్ని చూడాలనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ 3వ స్థానానికి వెళ్లాలి. ఇది T20 ఫార్మాట్.. యశస్వి జైస్వాల్ వేగంగా ప్రారంభాన్ని ఇస్తాడు. జట్టుకు రోహిత్, జైస్వాల్ ఇద్దరూ త్వరితగతిన స్కోర్ అందించగలరని చెప్పుకొచ్చాడు. మూడు వరుస విజయాలతో భారత్ ఇప్పటికే సూపర్-8 దశకు అర్హత సాధించింది. నేడు కెనడాతో గ్రూప్ Aలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఎ మ్యాచ్ భారత్-కెనడా మధ్య ఫ్లోరిడాలో ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.
గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో కెనడాతో టోర్నీలో భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. కెనడాతో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా, అది టీమ్ ఇండియాపై పెద్దగా ప్రభావం చూపదు. అయితే వర్షం కురవకపోతే సూపర్ ఎయిట్‌లోకి వెళ్లే ముందు టీమిండియా లోపాలను అధిగమించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో కెనడా ఇప్పటికే సపూర్-8 రౌండ్ నుండి నిష్క్రమించింది. టీ20 క్రికెట్‌లో భారత్, కెనడా మధ్య ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. టీ20లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.
Read Also : Bajaj CNG Bike: బజాజ్ CNG బైక్ మరింత ఆలస్యం.. జూలై 17న విడుదల..!