India Captain: టీ20లకు రోహిత్ గుడ్ బై.. నెక్స్ట్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరు..?
- By Gopichand Published Date - 01:04 PM, Sun - 30 June 24

India Captain: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కూడా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు టీ20 టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ (India Captain) ఎవరు అనేది పెద్ద ప్రశ్న? ఈ జాబితాలో ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది.
శుభమన్ గిల్
జింబాబ్వే టూర్‌కు టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు ఐపీఎల్ 2024లో గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ కెప్టెన్సీలో జింబాబ్వే టూర్‌లో టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. అతడినే తదుపరి కెప్టెన్‌గా నియమించవచ్చు.
హార్దిక్ పాండ్యా
టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్‌లో టీమ్‌ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరు అనే పెద్ద ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇందులో హార్దిక్ పాండ్యా పేరు మొదటగా ఉంది. హార్దిక్‌కు మంచి కెప్టెన్సీ అనుభవం ఉంది. అతని కెప్టెన్సీ అనేక T20 సిరీస్‌లను కూడా గెలుచుకుంది. ఇది కాకుండా హార్దిక్ ఐపిఎల్‌కు మూడు సీజన్‌లకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.
Also Read: Team India Prize Money: టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఇదే..!
సూర్యకుమార్ యాదవ్
రోహిత్ తర్వాత టీ20 జట్టుకు కెప్టెన్‌గా టీం ఇండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో సూర్యకుమార్ ఒకరు. టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య ప్రదర్శన చాలా బాగుంది. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్య సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించింది.
We’re now on WhatsApp : Click to Join
శ్రేయాస్ అయ్యర్
టీమ్ ఇండియా తెలివైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉంటున్నాడు. కానీ అయ్యర్ కూడా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఈసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2024 టైటిల్‌ను గెలుచుకుంది.