Team India Prize Money: టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఇదే..!
- Author : Gopichand
Date : 30-06-2024 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
Team India Prize Money: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు కోట్ల రూపాయలను బహుమతి (Team India Prize Money)గా అందుకుంది. టీమ్ ఇండియాతో పాటు సౌతాఫ్రికా కూడా ప్రైజ్ మనీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు దాదాపు రూ. 20 కోట్లను రివార్డ్‌గా అందుకుంది. దీంతో పాటు సూపర్ 8లో గెలిచిన జట్లకు కూడా డబ్బులు ప్రైజ్ మనీ ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్స్‌కు చేరిన జట్లకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ అందింది. ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఇది దాదాపు రూ.93.51 కోట్లు అవుతుంది. టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌కు 2.45 మిలియన్ డాలర్లు అంటే 20.36 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో పాటు సౌతాఫ్రికా కూడా భారీ మొత్తం అందుకుంది. ఆఫ్రికన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. 10.64 కోట్లు ప్రైజ్ మనీగా తీసుకుంది.
Also Read: Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
సెమీ-ఫైనల్‌కు చేరిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభించింది
టీమిండియా, దక్షిణాఫ్రికాతో పాటు మరో రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ రెండు జట్లూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు ప్రైజ్ మనీగా రూ.6.54 కోట్లు వచ్చాయి. ఇవి కాకుండా ఇతర జట్లకు కూడా ప్రైజ్ మనీ లభించింది. టోర్నీలో రెండో రౌండ్ అంటే సూపర్ 8కి చేరిన ప్రతి జట్టు రూ.3.17 కోట్లు అందుకుంది.
We’re now on WhatsApp : Click to Join
చివరి స్థానంలో నిలిచిన జట్టుకు కూడా ప్రైజ్ మనీ
T20 వరల్డ్ కప్ 2024లో చివరి స్థానంలో నిలిచిన జట్టు కూడా ప్రైజ్ మనీని అందుకుంది. ఇందులో 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు రూ.2.05 కోట్లు వచ్చాయి. 13 నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు రూ.1.87 కోట్లు వచ్చాయి. మొదటి, రెండో రౌండ్లలో విజయం సాధించినందుకు 25.89 లక్షల రూపాయలు వచ్చాయి. సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఇక్కడ టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ జట్టు రెండో స్థానంలో ఉంది. కాగా గ్రూప్-2లో దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో ఉంది.