Finn Allen: టీ20ల్లో సరికొత్త రికార్డు.. 19 సిక్సులతో విధ్వంసం, ఎవరీ ఐపీఎల్ అన్‌సోల్డ్ ఆటగాడు!
సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరఫున ఆడిన ఫిన్ అలెన్.. శుక్రవారం (జూన్ 13, 2025) ఓక్‌లాండ్ కొలిసియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలింగ్ దాడిని చిత్తు చిత్తుగా కొట్టాడు. అతను 51 బంతుల్లో 151 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి, 19 సిక్సర్లు కొట్టాడు.
- By Gopichand Published Date - 01:34 PM, Fri - 13 June 25

Finn Allen: ఐపీఎల్ అనేది దేశీ-విదేశీ ప్రతిభావంతులకు ఒక వేదికగా ఉంటుంది. ఇక్కడ స్కౌట్స్ ప్రపంచవ్యాప్తంగా టాలెంట్‌ను వెతికి తీసుకొస్తారు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఐపీఎల్‌లో అమ్ముడుపోని న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) తన బ్యాట్‌తో MLC 2025లో విధ్వంసం సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) తొలి మ్యాచ్‌లో అతను సిక్సర్ల వర్షం కురిపించి, టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.
సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరఫున ఆడిన ఫిన్ అలెన్.. శుక్రవారం (జూన్ 13, 2025) ఓక్‌లాండ్ కొలిసియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలింగ్ దాడిని చిత్తు చిత్తుగా కొట్టాడు. అతను 51 బంతుల్లో 151 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి, 19 సిక్సర్లు కొట్టాడు. దీంతో క్రిస్ గేల్ (2017), ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ (2024) జాయింట్‌గా నెలకొల్పిన 18 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 ఫోర్లు కూడా కొట్టాడు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి హార్ట్ బ్రేకింగ్.. 10 రోజుల వ్యవధిలో రెండో కప్ మిస్!
Finn Allen's out here breaking records 💯 He smashed the fastest century in MLC history for the @SFOUnicorns! 🔥 pic.twitter.com/SVyQ9n99Rf
— Cognizant Major League Cricket (@MLCricket) June 13, 2025
రికార్డుల వర్షం
అత్యంత వేగవంతమైన 150: అలెన్ కేవలం 49 బంతుల్లో 150 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 150 రికార్డును సృష్టించాడు. గేల్ (50 బంతుల్లో 150, 2013 ఐపీఎల్) రికార్డును బద్దలు కొట్టాడు.
అత్యధిక సిక్సర్లు: 19 సిక్సర్లతో టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించాడు.
MLCలో అత్యంత వేగవంతమైన సెంచరీ: అలెన్ 34 బంతుల్లో సెంచరీ చేసి MLC చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. నికోలస్ పూరన్ (40 బంతుల సెంచరీ, 2023) రికార్డును అధిగమించాడు.
అర్ధసెంచరీ: కేవలం 20 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
MLCలో అత్యధిక వ్యక్తిగత స్కోరు: 151 పరుగులతో MLC చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సృష్టించాడు. పూరన్ (137*, 2023) రికార్డును బద్దలు కొట్టాడు.
MLCలో అత్యధిక జట్టు స్కోరు: అలెన్ ఇన్నింగ్స్ సహాయంతో సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 269/5 స్కోరు సాధించి, MLC చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు రికార్డు నెలకొల్పింది.
సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. అలెన్ తన దూకుడును మొదటి ఓవర్ నుంచే ప్రారంభించాడు., పవర్‌ప్లేలో 14 బంతుల్లో 40 పరుగులు (5 సిక్సర్లతో) చేశాడు. సంజయ్ కృష్ణమూర్తి (36, 20 బంతులు), హసన్ ఖాన్ (38*, 18 బంతులు) మద్దతుతో జట్టు 269/5 స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 13.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (42), మిచెల్ ఓవెన్ (39) మాత్రమే కొంత పోరాడారు. హరీస్ రఫ్ (3/30), హసన్ ఖాన్ (3/38) బౌలింగ్‌లో రాణించారు. యునికార్న్స్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది MLC చరిత్రలో అతిపెద్ద విజయం.