IND vs AUS 4th Test: భరత్… ఏందయ్యా ఇది.. ఇలా అయితే ఎలా..!
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు (IND vs AUS 4th Test) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.
- By Gopichand Published Date - 03:02 PM, Thu - 9 March 23

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు (IND vs AUS 4th Test) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వదిలేశాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లోనే చేతుల్లోకి వచ్చిన సులువైన క్యాచ్‌ని కేఎస్ భరత్ మిస్ చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుండగా మ్యాచ్‌ని వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కూడా స్టేడియానికి వచ్చారు.
ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ సింపుల్‌గా క్యాచ్ ఇచ్చేశాడు. ఉమేశ్ యాదవ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని ట్రావిస్ హెడ్ డ్రైవ్ చేయబోయాడు. అది బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ భరత్‌కి క్యాచింగ్ పొజిషన్‌లోనే కంపర్ట్‌గా వెళ్లింది. దాంతో ఆ క్యాచ్‌ని సులువుగా అందుకోవాల్సిన భరత్ నేలపాలు చేశాడు.
KS bharat drop here. You can see he takes a step to the legside. (Second photo) So already he is unbalanced, and then he doesn't quiet get to the ball, he reaches out (last photo) very tough to take a opposite step then come back in. Technical error #INDvsAUSTest #INDvAUS pic.twitter.com/7pwSdIPUKu
— lucas (@LucasR32sky) March 9, 2023
కేఎస్ భరత్ క్యాచ్ చేజార్చడంతో బౌలర్ ఉమేశ్ యాదవ్ కోపంగా కనిపించాడు. రోహిత్ శర్మ నమ్మలేనట్లు ఆశ్చర్యంతో నోటిపై చేతుల్ని పెట్టుకోగా.. పక్కనే ఉన్న ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్ మంచి ఛాన్స్ మిస్ అయ్యిందంటూ తలపై చేతుల్ని పెట్టుకున్నాడు. చివరికి అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి హెడ్ ఔటయ్యాడు. దాంతో భరత్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఒక ఇంపార్టెంట్ క్యాచ్ మిస్ చేయడంతో భరత్.. ఏంటయ్యా ఆ కీపింగ్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: PM With PM: పీఎం మోడీతో ఆస్ట్రేలియా పీఎం సెల్ఫీ.. ఫొటో వైరల్!
అయితే భరత్ కీపింగ్ పై రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, మాథ్యూ హేడెన్ ఇలా స్పందించారు. ఇది సులభమైన క్యాచ్. అయితే టెస్టు క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌లు సులువు కావు అని గవాస్కర్ అన్నారు. కేఎస్ భరత్ కీపింగ్ పొజిషన్ కరెక్ట్ గా లేదు. కీపింగ్ చేసే చేతులు ఎప్పుడు బంతిని అంచనా వేస్తూ ఉండాలి. క్యాచ్ మిస్ చేయడమనేది భరత్ నిర్లక్ష్యమే అని హేడెన్ అన్నాడు. ఆ క్యాచ్ భరత్ పట్టాల్సింది అని రవిశాస్త్రి అన్నాడు. భరత్ కొంచెం నెర్వస్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చేతులు బంతి ఉన్న చోట కంటే తక్కువ స్థానంలో ఉన్నాయి. బంతి స్వింగ్ అయ్యింది. భరత్ అనుకున్నదానికంటే, చేతులు ఉండాల్సిన చోట కంటే కొంచెం తక్కువగా ఉండటంతో క్యాచ్ డ్రాప్ అయిందని దినేష్ కార్తీక్ అన్నాడు.

Related News

India vs Australia: స్టార్క్ దెబ్బకు భారత్ విలవిల
విశాఖ వన్డేలో భారత (India) బ్యాటింగ్ కుప్పకూలింది. ఊహించని విధంగా టాపార్డర్ లో కోహ్లీ తప్పిస్తే అంతా ఘోరంగా విఫలమయ్యారు. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే సగం జట్టు పెవిలియన్ కు చేరింది.