Rohit Sharma: రోహిత్ ఈజ్ బ్యాక్.. ఒకే దెబ్బకు రెండు రికార్డులు బద్ధలు!
భారత్ తరఫున వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతను 18426 పరుగులు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
- By Gopichand Published Date - 07:24 PM, Sun - 9 February 25

Rohit Sharma: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టి రోహిత్ పెద్ద రికార్డు సృష్టించాడు. దీంతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. అతను ఇప్పుడు ODI ఫార్మాట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అయితే హిట్‌మ్యాన్ ఇప్పుడు ODIలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను రాహుల్ ద్రవిడ్, క్రిస్ గేల్‌లను వెనక్కి నెట్టాడు.
రోహిత్ శర్మ నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు
భారత్ తరఫున వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతను 18426 పరుగులు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో భారత్ తరఫున 13,906 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 11363 పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు రోహిత్ పేరు మీద 10894 పరుగులు ఉన్నాయి. 10889 పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు.
Also Read: Beef Biryani Controversy: యూనివర్శిటీలో కలకలం.. చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ!
The flick first and then the loft! 🤩
Captain Rohit Sharma gets going in Cuttack in style! 💥
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/uC6uYhRXZ4
— BCCI (@BCCI) February 9, 2025
భారత్ తరఫున అత్యధిక వన్డే పరుగులు
- 18,426 – సచిన్ టెండూల్కర్
- 13,906 – విరాట్ కోహ్లీ
- 11,363 – సౌరవ్ గంగూలీ
- 10894* – రోహిత్ శర్మ
- 10,889 – రాహుల్ ద్రవిడ్
అదే సమయంలో ఈ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పరంగా రోహిత్ క్రిస్ గేల్‌ను వెనక్కినెట్టాడు. క్రిస్ గేల్ పేరిట 331 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ 3 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు 332 సిక్సర్లతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు
- షాహిద్ అఫ్రిది- 351
- రోహిత్ శర్మ*- 332
- క్రిస్ గేల్- 331
- సనత్ జయసూర్య- 270
- ఎంఎస్ ధోని- 229
- ఇయోన్ మోర్గాన్- 220