Mohammed Shami: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. మహ్మద్ షమీ చరిత్ర సృష్టించే ఛాన్స్!
మహ్మద్ షమీ 2023 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా షమీ చాలా కాలం పాటు క్రికెట్ మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
- By Gopichand Published Date - 01:42 PM, Tue - 4 February 25

Mohammed Shami: టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అభిమానుల కళ్లు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)పైనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత టీమ్ ఇండియాకు షమీ తిరిగి వచ్చి టీ20 సిరీస్‌లో ఆడాడు. షమీకి పునరాగమనం ప్రత్యేకత ఏమీ కానప్పటికీ.. అతను గత మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సందడి చేసేందుకు మహమ్మద్ షమీ సిద్ధమయ్యాడు. ఈ సిరీస్‌లో షమీ చరిత్ర సృష్టించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. మొదటి వన్డే మ్యాచ్‌లో షమీ ఈ ఫీట్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు
మహ్మద్ షమీ 2023 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా షమీ చాలా కాలం పాటు క్రికెట్ మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతని ప్రదర్శన చాలా ఆకట్టుకుంది. అయితే, ఇంగ్లండ్‌తో వన్డే క్రికెట్‌లో షమీ చరిత్ర సృష్టించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. తొలి వన్డే మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు తీస్తే వన్డే క్రికెట్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కవచ్చు.
Also Read: Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
ప్రస్తుతం షమీ 101 వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల్లో 195 వికెట్లు తీశాడు. ప్రపంచ క్రికెట్‌లో 102 వన్డే ఇన్నింగ్స్‌లలో 200 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఈ రికార్డు ఉంది. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ రికార్డును షమీ సమం చేయగలడు. మరి తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీయగలడా లేదా అనేది చూడాలి.
ఈ వన్డే సిరీస్ షమీకి కీలకం
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మహమ్మద్ షమీకి చాలా కీలకం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా జట్టులో షమీని కూడా చేర్చారు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తనను తాను నిరూపించుకోవడానికి షమీకి ఈ చివరి సిరీస్ మిగిలి ఉంది.