Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్‌కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
- Author : Latha Suma
Date : 04-02-2025 - 1:17 IST
Published By : Hashtagu Telugu Desk
Prayagraj : ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలోపాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న (బుధవారం) ఆయన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. ఈమేరకు ప్రధాని షెడ్యూల్‌ను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్‌కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్ ఘాట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయల్దేరుతారు. అని సదరు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు ఆ కథనాల సమాచారం.
Read Also: Hyderabad : బస్సు ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని తెలుస్తోంది. కేవలం పుణ్యస్నానం ఆచరించి గంగానదికి పూజలు చేయనున్నట్లు తెలుస్తుంది. దాదాపు గంటన్నర పాటు మోడీ ప్రయాగ్‌రాజ్‌లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే నగరంతో పాటు కుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
కాగా, మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ప్రయాగ్‌రాజ్ వెళ్లిన విషయం తెలిసిందే. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 144 ఏళ్లకోసారి వచ్చే జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 35 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు.