ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్కు ఎఫైర్ ఉందా?!
మేరీ కోమ్ తనను ఒక వస్తువులా వాడుకుని వదిలేశారని ఓన్లర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీకి పునాది వేసింది ఎవరు? రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
- Author : Gopichand
Date : 13-01-2026 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
Mary Kom: భారత దిగ్గజ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్, ఆమె మాజీ భర్త కారుంగ్ ఒన్ఖోలర్ (ఓన్లర్) మధ్య వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. మేరీ కోమ్ తనపై చేసిన ఆర్థిక మోసపు ఆరోపణలను ఓన్లర్ తీవ్రంగా ఖండించారు.
ఆర్థిక ఆరోపణలపై ఓన్లర్ స్పందన
కొద్దిరోజుల క్రితం మేరీ కోమ్ తన మాజీ భర్త ఓన్లర్ తనను కోట్లాది రూపాయల మేర మోసం చేశారని, ఆయన వల్ల తాను భూమిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. దీనికి ఓన్లర్ మాట్లాడుతూ.. ఆమె చేసిన ఆరోపణలన్నీ అబద్ధం. నేను రూ. 5 కోట్లు దొంగిలించానని ఆమె అంటోంది. నా బ్యాంక్ అకౌంట్ తనిఖీ చేయండి. 18 ఏళ్ల వివాహ బంధం తర్వాత కూడా నేను ప్రస్తుతం ఢిల్లీలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు అని ఆయన పేర్కొన్నారు.
Also Read: మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
నన్ను వాడుకుని వదిలేశారు
మేరీ కోమ్ తనను ఒక వస్తువులా వాడుకుని వదిలేశారని ఓన్లర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీకి పునాది వేసింది ఎవరు? రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. అకాడమీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ ఇప్పుడు తన పేరును తొలగించి వేరొకరిని చైర్మన్గా నియమించారని ఆయన ఆరోపించారు. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు.
మరో వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపణ
ఓన్లర్ తన మాజీ భార్యపై కొన్ని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. 2013లో ఆమెకు ఒక జూనియర్ బాక్సర్తో సంబంధం ఉందని, ఆ సమయంలో కుటుంబాల మధ్య గొడవలు జరిగినా తాము సర్దుకుపోయామని చెప్పారు. 2017 నుండి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే ఒక వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వాట్సాప్ సందేశాలు, ఇతర సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలుసు. ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నాను అని ఆయన వెల్లడించారు. మేరీ కోమ్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి వ్యక్తిగత జీవితంలో ఇటువంటి వివాదాలు తలెత్తడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఓన్లర్ చేసిన ఈ తాజా ఆరోపణలపై మేరీ కోమ్ నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.