HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Lords To Host Final Of Icc Womens T20 World Cup 2026

Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్క‌డంటే?

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు జట్టులు 2025 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి ఎంపిక అవుతాయి.

  • Author : Gopi Date : 01-05-2025 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Women’s T20 World Cup
Women’s T20 World Cup

Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ (Women’s T20 World Cup) ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జులై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం వెల్లడించింది. ఈ టోర్నమెంట్‌లో 12 జట్టలు పాల్గొంటాయి. మొత్తం 33 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. టోర్నమెంట్ జూన్ 12 నుండి ప్రారంభమవుతుంది. లార్డ్స్‌తో పాటు, మిగిలిన మ్యాచ్‌లు ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ఓవల్, హాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లలో జరుగుతాయి. అన్ని జట్టులు రెండు గ్రూపులుగా విభజించబడతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ఆడబడతాయి.

ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు జట్టులు 2025 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి ఎంపిక అవుతాయి.

Also Read: Samsung : ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’పోటీని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

ఐసీసీ చైర్మన్ జయ్ షా ప్రకటన

ఐసీసీ చైర్మన్ జయ్ షా మాట్లాడుతూ.. “బ్రిటన్‌లో అన్ని జట్టులకు ఎంతో మద్దతు లభిస్తుంది. 2017లో లార్డ్స్‌లో జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ఫైనల్ కోసం ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదు.” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. “మేము టోర్నమెంట్ సన్నాహాలపై దృష్టి సారిస్తున్నాము. ఉత్కంఠభరితమైన టీ20 క్రికెట్ ఇక్కడి అభిమానులను ఆకర్షించడమే కాకుండా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి ఒక పెద్ద అవకాశంగా నిలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది.” అని అన్నారు. 2020లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆ తర్వాత కేప్‌టౌన్ (2023), దుబాయ్ (2024)లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కూడా స్టేడియంలు పూర్తిగా నిండాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • ICC
  • india
  • T20 world cup
  • Women’s T20 World Cup
  • Womens T20 World Cup 2026

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

    Latest News

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd