World Test Championship: బంగ్లాతో గెలుపు తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో టీమిండియా…!
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది.
- By Gopichand Published Date - 11:42 PM, Sun - 22 September 24

World Test Championship: రోహిత్ శర్మ సారథ్యంలో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఏకపక్షంగా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందు ఉంచింది. అయితే ఇక్కడ బంగ్లా జట్టు 234 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ ఓటమి కారణంగా బంగ్లాదేశ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) 2023-25 పాయింట్ల పట్టికలో చాలా నష్టపోయి నేరుగా ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ భారీ విజయంతో టీమ్ ఇండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది. ఆసీస్ విజయ శాతం 62.50. బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఆరవ స్థానానికి పడిపోయింది. విజయాల శాతం 39.29గా మారింది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్, శ్రీలంకల కంటే ముందున్న జట్టు ఇప్పుడు రెండు జట్ల కంటే దిగువకు చేరింది.
Also Read: Junior NTR Reaction: దేవర ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన.. వీడియో వైరల్..!
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దాదాపు ఖాయం
2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై టెస్టు తర్వాత ప్రస్తుత WTC సైకిల్‌లో జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో బంగ్లాదేశ్‌తో ఒకటి, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో జట్టు ఆరు మ్యాచ్‌లు గెలవాలి.
WTCలో పాయింట్లను ఎలా పొందుతారు..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్‌లో ప్రతి విజయానికి 12 పాయింట్లు లభిస్తాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై అయితే ఇరు జట్లకు చెరో ఆరు పాయింట్లు వస్తాయి. ఒకవేళ డ్రా అయినట్లయితే ICC రెండు జట్లకు నాలుగు పాయింట్లు ఇస్తుంది. అయితే ఇప్పుడు ICC నిబంధనలను మార్చింది. ఇక్కడ జట్లను పాయింట్ల ఆధారంగా కాకుండా పాయింట్ల శాతం వ్యవస్థ (PCT) ఆధారంగా ర్యాంక్ చేస్తోంది. గత ఏడాది ఫైనల్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.