HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Junior Ntr Reaction On Devara Movie Pre Release Event Cancel

Junior NTR Reaction: దేవ‌ర ఈవెంట్ ర‌ద్దుపై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆవేద‌న.. వీడియో వైర‌ల్‌..!

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం బాధాకరం. అభిమానుల కన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నా. షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలనుకున్నా.

  • Author : Gopi Date : 22-09-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR Devara 2 Following Pushpa 2 Koratala Siva
NTR Devara 2 Following Pushpa 2 Koratala Siva

Junior NTR Reaction: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Junior NTR Reaction) హీరోగా.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ దేవ‌ర‌. ఈ మూవీ ఈనెల 27వ తేదీన ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా సినిమా కావ‌టంతో బాలీవుడ్ న‌టులు సైఫ్ అలీ ఖాన్‌, జాన్వీ క‌పూర్ కూడా న‌టించారు. అయితే ఇటీవ‌ల ముంబై, చెన్నైల్లో మూవీ ప్ర‌మోష‌న్ ఈవెంట్ నిర్వ‌హించిన చిత్ర‌బృందం తాజాగా తెలుగులో కూడా ఈరోజు (సెప్టెంబ‌ర్ 22) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌ను ప్లాన్ చేసింది. అయితే ఈ వేడుక‌ను హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్లో నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అందుకు త‌గ్గ ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే ఈ ఈవెంట్‌కు అనుకున్న దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావ‌టంతో పోలీస్ భ‌ద్ర‌తా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా వేడుక నిర్వ‌హించాల్సిన ఆడిటోరియంలో కూడా సెలెబ్రిటీల‌కు సైతం కూర్చునేందుకు ప్లేస్ లేకుండా అభిమానులు వ‌చ్చేశారు. దీంతో ఈవెంట్ నిర్వాహ‌కులు, పోలీసులతో అభిమానులు స‌రైన ఏర్పాట్లు లేవ‌ని వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా హోట‌ల్లోని విలువైన వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు సైతం అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌లేమ‌ని, సెక్యూరిటీ ఇబ్బందిగా మారింద‌ని ఈవెంట్‌ను రద్దు చేశారు.

Also Read: MLA Pantham Nanaji Apology : క్షమాపణలు కోరిన జనసేన ఎమ్మెల్యే ..రేపు దీక్ష చేస్తానని ప్రకటన

దేవర ప్రీ రిలీజ్ క్యాన్సిల్ పై ఎన్టీఆర్ వ్యాఖ్యలు pic.twitter.com/JCeGxQntrc

— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024

ఈ క్ర‌మంలోనే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్టీఆర్ స్పందించారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం బాధాకరం. అభిమానుల కన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నా. షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలనుకున్నా. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దు అయ్యింది. ఈ రోజు కలవకపోయినా సప్టెంబర్ 27న కలుద్దాం. ఈ ఈవెంట్ ర‌ద్దు ఎవ‌రూ కార‌ణం కాదు. కొర‌టాల శివ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లార‌ని ఆశిస్తున్నాను. ఇక సెల‌వు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇక‌పోతే ఈ సినిమాను యువ‌సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ బ్యాన‌ర్‌పైన నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌లు మూవీపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara Part 1
  • Janhvi Kapoor
  • jr ntr
  • Koratala Shiva
  • Movie News
  • Novatel Hotel
  • ntr fans
  • pre release event
  • tollywood

Related News

Boyapati Srinu

కార్తీతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన కార్తీపై బోయపాటి ఆసక్తి చూపిస్తున్నారు.

    Latest News

    • Cigarette Prices : మరోసారి సిగరెట్ ధరలు పెరగనున్నాయా ..?

    • Good News : ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

    • 10th Result Telangana : ర్యాంకులు ప్రకటిస్తే స్కూళ్ల గుర్తింపు రద్దు – ప్రభుత్వం హెచ్చరిక

    • Ajith Kumar : అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు

    • TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd