Eden Pitch: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై గిల్, గంభీర్ అసంతృప్తి?!
సాయంత్రం దక్షిణాఫ్రికా జట్టు నెట్ సెషన్ ముగిసిన తర్వాత CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పిచ్‌ను పరిశీలించారు. ప్రధాన ట్రాక్‌ను తాకకుండా పక్కనున్న వికెట్లకు మాత్రమే నీరు పోయాలని గ్రౌండ్‌మెన్‌లకు సూచించారు.
- By Gopichand Published Date - 04:49 PM, Wed - 12 November 25
Eden Pitch: పొగమంచుతో నిండిన వాతావరణంలో చారిత్రక ఈడెన్ గార్డెన్స్ (Eden Pitch) టెస్ట్ క్రికెట్‌కు తిరిగి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన శిక్షణ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌పై అందరి దృష్టి నిలిచింది.
సంతృప్తి లేని మేనేజ్‌మెంట్?
శిక్షణ తర్వాత గిల్, గంభీర్ సహా కోచింగ్ సిబ్బంది సెంటర్ వికెట్‌ను దీర్ఘకాలంగా పరిశీలించారు. పిచ్ పొడిగా, గోధుమ రంగులో కనిపించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. గిల్, బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పిచ్ దృఢత్వాన్ని అంచనా వేశారు. వారి హావభావాలు చూస్తుంటే పిచ్ ఉపరితలం పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అనంతరం కెప్టెన్ గిల్, పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు.
పిచ్ పరిస్థితి
పిచ్ దాదాపు వారం రోజులుగా నీరు పోయకుండా పొడిగా ఉంది. ఈ పొడి ఉపరితలం మ్యాచ్ చివరి రోజుల్లో రివర్స్ స్వింగ్, వేరియబుల్ బౌన్స్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ‘ర్యాంక్ టర్నర్’ (స్పిన్‌కు అనుకూలమైన పిచ్) కోసం అభ్యర్థన చేయలేదని CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు.
Also Read: AP Govt : గ్రామ పంచాయతీలకు ఏపీ సర్కార్ భారీ నిధులు
గంగూలీ కూడా పరిశీలన
సాయంత్రం దక్షిణాఫ్రికా జట్టు నెట్ సెషన్ ముగిసిన తర్వాత CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పిచ్‌ను పరిశీలించారు. ప్రధాన ట్రాక్‌ను తాకకుండా పక్కనున్న వికెట్లకు మాత్రమే నీరు పోయాలని గ్రౌండ్‌మెన్‌లకు సూచించారు.
ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ పిచ్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. రంజీ మ్యాచ్‌లలో పేసర్లు మహ్మద్ షమీ, ఆకాష్ దీప్‌లకు మొదట్లో తక్కువ సహాయం లభించినప్పటికీ.. బంతి పాతబడిన తర్వాత రివర్స్ స్వింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. మొత్తంమీద ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై నెలకొన్న ఉత్కంఠ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసక్తిని పెంచుతోంది.