IPL Tickets: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. టికెట్ల ధర రూ. 999 నుంచి ప్రారంభం!
టిక్కెట్ల ధర చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది స్టేడియం, జట్టు, సీటింగ్ కేటగిరీ ప్రకారం ఉంటుంది.
- Author : Gopichand
Date : 08-03-2025 - 2:47 IST
Published By : Hashtagu Telugu Desk
IPL Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ (IPL Tickets) ప్రారంభం కాకముందే అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. జట్టు, స్టేడియం ఆధారంగా ఐపీఎల్ టికెట్ ధర నిర్ణయించారు. అయితే టికెట్ ధర నుండి ఎలా కొనాలి అనే వరకు పూర్తి ప్రక్రియను ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. మీరు టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం!
టిక్కెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయం
IPL 2025 టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. మీరు బుక్ మై షో, Paytm, IPLT20.com, అన్ని ఫ్రాంచైజ్ జట్ల వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయాలనుకుంటే వాటిని స్టేడియం నుండి కొనుగోలు చేయవచ్చు. కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో కూడా టిక్కెట్లు విక్రయించనున్నారు.
Also Read: Kamala Harris : కమలా హ్యారిస్ మళ్లీ పోటీ చేస్తారా ? నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ?
టిక్కెట్ల ధర ఎంత?
టిక్కెట్ల ధర చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది స్టేడియం, జట్టు, సీటింగ్ కేటగిరీ ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు ఎంఏ చిదంబరం స్టేడియం ధర మూడు వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ప్రతి విభిన్న వేదిక ధర ఉంటుంది. అయితే ఐపీఎల్‌లో పెద్ద మ్యాచ్‌ల టిక్కెట్లు వెంటనే అమ్ముడవుతాయి. అయితే వీలైనంత త్వరగా మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 20న జరగనున్న ముంబై, చెన్నై మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 7న జరగనున్న ముంబై, ఆర్సీబీ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.999 నుంచి రూ.21 వేల వరకు ఉంది. ఏప్రిల్ 17న ముంబై, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీని కోసం టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. అయితే ముంబై, చెన్నై మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం ఇంకా ప్రారంభం కాలేదు.