Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడనున్న జహీర్ ఖాన్?!
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన నిరాశపరిచింది. పంత్ నాయకత్వంలో జట్టు పలు క్లోజ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. సీజన్‌లో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లలో జట్టు కేవలం 6 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. స్వయంగా పంత్ కూడా బ్యాటింగ్‌లో ఈ సీజన్ అంతా ఆకట్టుకోలేకపోయాడు.
- By Gopichand Published Date - 09:11 PM, Thu - 18 September 25

Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ (LSG)- జహీర్ ఖాన్‌ల (Zaheer Khan) మధ్య దూరం పెరగుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2025లో మెంటార్‌గా జట్టుతో జతకట్టిన జహీర్.. ఒక సీజన్ తర్వాతే జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. నివేదికల ప్రకారం.. జహీర్ వ్యూహాలు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, జట్టు యజమాని సంజీవ్ గోయెంకాల వ్యూహాలతో సరిపోలకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2025లో లక్నో ప్రదర్శన ఆశాజనకంగా లేదు. రిషబ్ పంత్ సారథ్యంలోని జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 6 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది.
ఎల్‌ఎస్‌జిని వీడిన జహీర్
జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. జహీర్ తన నిర్ణయాన్ని గురువారం నాడు ఎల్‌ఎస్‌జికి తెలియజేశాడు. గౌతమ్ గంభీర్ నిష్క్రమించిన తర్వాత ఆగస్టు 2024లో జహీర్ లక్నో జట్టుకు మెంటార్‌గా చేరాడు. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్, జహీర్ ఖాన్‌ల కలయికపై జట్టుకు చాలా ఆశలు ఉన్నప్పటికీ ఐపీఎల్ 2025లో జట్టు పేలవంగా రాణించింది.
జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యారు. దీనివల్ల జట్టు బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. జహీర్ ఇంతకు ముందు 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్‌తో కలిసి పనిచేశాడు. జహీర్ లక్నో జట్టుతో రెండేళ్ల ఒప్పందం చేసుకున్నాడు.
Also Read: Gameskraft: గేమ్స్‌క్రాఫ్ట్‌లో 120 మంది ఉద్యోగుల తొలగింపు!
నిరాశపరిచిన జట్టు ప్రదర్శన
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన నిరాశపరిచింది. పంత్ నాయకత్వంలో జట్టు పలు క్లోజ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. సీజన్‌లో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లలో జట్టు కేవలం 6 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. స్వయంగా పంత్ కూడా బ్యాటింగ్‌లో ఈ సీజన్ అంతా ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా జట్టు బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్‌కు చేరిన లక్నో జట్టు గత రెండు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జట్టు వరుసగా రెండోసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. 2025 సీజన్‌లో జట్టు ఏడో స్థానంతో టోర్నమెంట్‌ను ముగించింది.