IPL Retention: రాహుల్ నుండి రిషబ్ పంత్ వరకు.. జట్లు విడుదల చేసే స్టార్ ఆటగాళ్లు వీరేనా?
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ KL రాహుల్ నిరంతర పేలవమైన ఫామ్, గాయం సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో అతను జట్టులో కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- By Gopichand Published Date - 10:39 AM, Thu - 31 October 24

IPL Retention: ఐపీఎల్ 2025 రిటైన్షన్ గడువు (IPL 2025 Retention) సమీపిస్తున్నందున అందరి దృష్టి ఇప్పుడు ఫ్రాంచైజీ జాబితాపై ఉంది. ఏ ఆటగాళ్లు ఏ జట్టుతో ఉంటారు. మెగా వేలం పూల్‌లో ఎవరిని చేర్చుకుంటారు అని అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. అన్ని జట్లు తమ బడ్జెట్‌లను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయడానికి, గొప్ప స్క్వాడ్‌ను నిర్మించాలని చూస్తున్నాయి. ఈ నిలుపుదల దశలో ఆశ్చర్యకరంగా కొంతమంది పెద్ద స్టార్ ఆటగాళ్ల పేర్లను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఏంటో చూద్దాం.
KL రాహుల్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ KL రాహుల్ నిరంతర పేలవమైన ఫామ్, గాయం సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో అతను జట్టులో కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ని విడుదల చేస్తే మెగా వేలంలో అతడిని తమ జట్టులో చేర్చుకునేందుకు పలు జట్ల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
Also Read: Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్‌బీఐ మెగా మిషన్
శ్రేయాస్ అయ్యర్: ఈ ఏడాది తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్‌ను ఈసారి కేకేఆర్ రిటైన్ చేసే అవకాశం లేదు. ఫిట్‌నెస్, పేలవమైన ప్రదర్శనలతో పోరాడుతున్న KKR లైనప్‌లో అయ్యర్ స్థానం పరిశీలనలో ఉంది.
రిషబ్ పంత్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ పాత్రపై జట్టులో అనిశ్చితి నెలకొంది. ఆయన విడుదలపై ఊహాగానాలు రావడానికి ఇదే కారణం.
ఫాఫ్ డు ప్లెసిస్: అనుభవజ్ఞుడైన ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌లో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. అయితే అతని వయసును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టీమ్ యూత్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటోంది. దీంతో అతడిని జట్టు అట్టిపెట్టుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
పాట్ కమిన్స్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఈసారి విడుదల కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ జట్టు తన బౌలింగ్ యూనిట్‌ను బలపేతం చేయడానికి చూస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఇతర ఎంపికలను పరిశీలిస్తోంది.