PBKS vs LSG: లక్నోపై 37 పరుగులతో పంజాబ్ ఘనవిజయం
ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 236 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 11:32 PM, Sun - 4 May 25

PBKS vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ (PBKS vs LSG) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 236 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ (91), అయ్యర్ (45), మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బ్యాటింగ్‌లో టాప్ స్కోరర్‌గా ఆయుష్ బదోనీ (74) నిలిచాడు. ఆ తర్వాత సమద్ (45) పరుగులతో రాణించాడు. కానీ ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లు లక్నో విజయానికి దోహదపడలేపోయాయి.
అర్షదీప్ సింగ్, అజ్మాతుల్లా ఒమర్జాయ్‌ల బౌలింగ్ కారణంగా పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. అర్షదీప్ నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అదే విధంగా ఒమర్జాయ్ నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా పంజాబ్ లక్నోను 20 ఓవర్లలో 199 పరుగులకు కట్టడి చేసి మ్యాచ్ ను తమ ఖాతాలో వేసుకుంది.
లక్నో తరఫున ఆయుష్ బడోనీ 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అబ్దుల్ సమద్ 45 పరుగులు చేశాడు. కానీ వారు జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్రభసిమ్రన్ సింగ్ 48 బంతుల్లో 91 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ తో లక్నోకు పంజాబ్ 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో తరఫున ఆకాశ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 16 పాయింట్లతో టేబుల్‌లో ఆర్సీబీ మొదటి స్థానంలో నిలిచింది.
Also Read: Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని
ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీనిని చేధించే క్రమంలో లక్నో జట్టు చాలా దారుణంగా ప్రారంభించింది. 16 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఎయిడెన్ మార్క్‌రామ్ 13 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. నికోలస్ పూరన్ వరుసగా ఐదవ మ్యాచ్‌లో కూడా పెద్ద స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. పంత్ సైతం అనవసరపు షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.