IPL 2025: టైటిల్ పోరు ఆ రెండు జట్ల మధ్యేనా? మ్యాచ్ విన్నర్లతో నింపేసిన ఫ్రాంచైజీలు!
పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది.
- By Gopichand Published Date - 01:30 PM, Thu - 12 December 24

IPL 2025: మెగా వేలంలో ఫ్రాంచైజీల (IPL 2025) బిహేవియర్ ఆశ్చర్యాన్ని కలిగించింది. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వెనుకాడిన జట్ల ఓనర్లు పేరు, వూరు తెలియని ఆటగాళ్లను కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అంతేకాదు కొందరు లెజెండరీ ప్లేయర్లు అన్ సోల్డుగా మిగిలిపోవడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి జరిగింది. కానీ ఓవరాల్ గా చూస్తే అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఏ జట్టు బలహీనంగా ఉందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయితే రెండూ జట్లు మాత్రం ఫైనల్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. దీంతో 110 కోట్ల భారీ పర్సు వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలంలోనూ పంజాబ్ అంతుచిక్కని స్ట్రాటజీని ప్లే చేసింది. ఓవరాల్ గా జట్టులో భారత్ మరియు విదేశీయులతో సహా చాలా మంది ఆల్ రౌండర్లున్నారు. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ ఏకంగా 26.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది ఐపిఎల్ చరిత్రలో రెండవ అత్యంత బిడ్. 27 కోట్లతో పంత్ ను లక్నో దక్కించుకుంది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ తమ జట్టులో యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్ మరియు లాకీ ఫెర్గూసన్ వంటి పెద్ద ఆటగాళ్లను చేర్చింది. చూస్తుంటే పంజాబ్ కింగ్స్ చాలా బలంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ గత సీజన్‌లో కేకేఆర్ మాదిరిగానే పంజాబ్‌ను చాంపియన్‌గా మార్చగలడని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ఇప్పటి వరకు పంజాబ్ 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్స్‌కు చేరింది.
Also Read: Vastu Tips: మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలు చుట్టుముట్టడం ఖాయం!
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫెవరెట్ జట్టుగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి మరియు హెన్రిచ్ క్లాసెన్‌లను కొనసాగించింది. వేలంలో మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ మరియు హర్షల్ పటేల్ వంటి స్టార్ ఆటగాళ్లను చేర్చింది. వీరంతా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లే. గతేడాది ఫైనల్‌లో హైదరాబాద్ కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ కు దూరమైంది. ఈ సారి కూడా హైదరాబాద్ టీం టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగే అవకాశముంది.