Sunrisers Hyderabad Strategy: ఇవాళ వేలంలో SRH వ్యూహం ఇదే!
2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణిస్తాడు. స్టోయినిస్ ఇప్పటివరకు మొత్తం 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1866 పరుగులు చేశాడు.
- By Gopichand Published Date - 10:57 AM, Sun - 24 November 24

Sunrisers Hyderabad Strategy: గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad Strategy) మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి తన పర్సు నుండి 75 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు పర్సులో కేవలం 45 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే ఎస్ఆర్హెచ్ ఈ డబ్బును చాలా తెలివిగా ఉపయోగించాలనుకుంటోంది. వేలంపాటలో పాల్గొనే ముందు తమ విశ్లేషకులతో ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించి మ్యాచ్ విన్నర్లతో జట్టును నిర్మించాలనుకుంటున్నారు. టైటిలే లక్ష్యంగా స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను జోడించాలనుకుంటుంది.
2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణిస్తాడు. స్టోయినిస్ ఇప్పటివరకు మొత్తం 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1866 పరుగులు చేశాడు. బౌలింగ్ పరంగా చూస్తే టోర్నీలో 43 వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలో 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఎస్ఆర్హెచ్ శిబిరంలో స్టోయినిస్‌ను చేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. గ్లెన్ మాక్స్‌వెల్ చివరి సీజన్లో దారుణ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ మ్యాక్స్‌వెల్‌కు 134 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. ఆస్ట్రేలియాకు ఆల్ రౌండర్గా ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు.
ఐపీఎల్ టోర్నీలో 2771 పరుగులు మరియు 37 వికెట్లు తీసుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను కచ్చితంగా ఇరుకునపెట్టగల సమర్థుడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా, స్పిన్ బౌలర్ గా సన్‌రైజర్స్ నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టగలడని చెప్పొచ్చు. సన్‌రైజర్స్ యాజమాన్యం కూడా మ్యాక్స్ వెల్ ని వేలంలో కొనుగోలు చేయాలనుకుంటుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ రైట్ ఆర్మ్ ఫుల్ టైమ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను వదులుకునే పరిస్థితి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వాషింగ్టన్ సుందర్ తన స్పిన్‌తో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా, అవసరం అనుకున్నప్పుడు బ్యాటింగ్ తోనూ జట్టును ఆదుకున్నాడు.
Also Read: Discount Offer: బంపరాఫర్.. ఈ ఐఫోన్ సిరీస్‌పై రూ. 39 వేల తగ్గింపు!
సుందర్ 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 378 పరుగులతో 37 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో భువి 176 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 181 వికెట్లు మరియు 306 పరుగులు చేశాడు. భువనేశ్వర్ 2018 నుంచి హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. పాట్ కమిన్స్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఎంపికగా సన్‌రైజర్స్ మరోసారి తమ జట్టులో భువనేశ్వర్‌ను చేర్చుకోవచ్చు. నటరాజన్ 2024లో హైదరాబాద్ తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో మొత్తం 19 వికెట్లు తీశాడు. మొత్తం 61 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీశాడు.
బౌలింగ్ పరంగా పాట్ కమిన్స్, భువనేశ్వర్ మరియు నటరాజన్‌ల త్రయాన్ని నిర్మించడానికి ఎస్ఆర్హెచ్ ప్రణాళికలు రచిస్తుంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇప్పుడు ఒక రైట్-టు-మ్యాచ్ కార్డ్ మిగిలి ఉంది. అది కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌పై మాత్రమే ఉపయోగించాలి. ఈ పరిస్థితిలో యాజమాన్యం వేలంలో ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళాలి. ఇదిలా ఉండగా రీటెన్షన్ ప్రక్రియలో హెన్రిచ్ క్లాసెన్‌కు అత్యధికంగా 23 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది, పాట్ కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లకు 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు వెచ్చించింది.