HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2024 Final To Be Held In Chennai

IPL 2024 Final: ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ ఫిక్స్‌.. ఎక్క‌డంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్‌లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.

  • Author : Gopichand Date : 24-03-2024 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2024 Tickets
Ipl 2024

IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్‌లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) IPL 2024 పూర్తి షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. బోర్డు 17వ సీజన్‌లోని మొదటి 21 మ్యాచ్‌ల అధికారిక షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. IPL 2024 ఫైనల్‌తో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించబోతోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ బహుశా మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుందని తెలుస్తోంది.

ఒక క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయని, రెండవ క్వాలిఫయర్ చెన్నైలో జరుగుతుందని BCCI సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ PTI తెలిపింది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభమైంది. లీగ్ దశలో ప్రస్తుతం 21 మ్యాచ్‌లు మాత్రమే జ‌ర‌గ‌నున్నాయి.

Also Read: Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వ‌ర‌లోనే ఆమోదం..!

IPL 2024 మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ మిగిలిన మ్యాచ్‌లు, ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. నిజానికి IPL 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం)లో నిర్వహించబడుతుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.

We’re now on WhatsApp : Click to Join

ఒక సీనియర్ బీసీసీఐ అధికారి పిటిఐతో మాట్లాడుతూ.. ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గత సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్ (చెన్నై సూపర్ కింగ్స్) హోమ్ గ్రౌండ్‌లో ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌ను నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరిస్తుందని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది.అది త్వరలో విడుదల కానుంది. బీసీసీఐ విడుదల చేసిన తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Chennai
  • Indian Premier League
  • ipl 2024
  • IPL 2024 Final
  • MA Chidambaram Stadium
  • Narendra Modi stadium

Related News

Hanuman Temple

హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

T20 World Cup  అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా

  • Team India Visited The Hanu

    India Win T20 World Title : WC ట్రోఫీతో హనుమాన్ టెంపుల్కు గంభీర్, సూర్య

  • IND vs NZ Final

    ఫైనల్ మ్యాచ్ పిచ్ ఎలా ఉండబోతోంది?

  • Ahmedabad Match Pitch Repor

    T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే !!

  • Team India players reach Ahmedabad

    అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య‌ సేన

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd