IPL 2023 Playoffs : చెన్నై లో క్వాలిఫైయర్.. అహ్మదాబాద్ లో ఫైనల్
ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదలయింది. ఇంతకు ముందు కేవలం లీగ్ స్టేజ్ షెడ్యూల్ మాత్రమే ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు ప్లే ఆఫ్స్ తేదీలను, వేదికలను ఖరారు చేసింది.
- By Naresh Kumar Published Date - 11:30 PM, Fri - 21 April 23

IPL 2023 Playoffs : ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదలయింది. ఇంతకు ముందు కేవలం లీగ్ స్టేజ్ షెడ్యూల్ మాత్రమే ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు ప్లే ఆఫ్స్ తేదీలను, వేదికలను ఖరారు చేసింది. లీగ్ మ్యాచ్‌లు మే21తో ముగియనుండగా.. మే 23న తొలి క్వాలిఫయర్, మే 24న ఎలిమినేటర్ మ్యాచ్, మే 26న క్వాలిఫయర్-2 జరగనున్నాయి. ఇక మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఐపీఎల్ (IPL) ను అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగ్గిపోవడంతో ఆయా ఫ్రాంచైజీల నగరాల్లో నిర్వహిస్తున్నారు. మ్యాచ్ లన్నీ హోరాహోరీగా జరుగుతుండటంతో స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో చాలా కాలం తర్వాత ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ కు అతి పెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఆరంభ వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. దాదాపు లక్షా 30 వేల మంది స్టేడియంలో కూర్చుని మ్యాచ్ ను వీక్షించవచ్చు.
ప్లే ఆఫ్స్ షెడ్యూల్ :
మే 23 – క్వాలిఫయర్-1 – చెన్నై
మే 24 – ఎలిమినేటర్ – చెన్నై
మే 26 – క్వాలిఫయర్-2 – అహ్మదాబాద్
మే 28 – ఫైనల్ – అహ్మదాబాద్
మ్యాచ్ లు అన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి.
Also Read: Mohammed Siraj; అదరగొట్టిన సిరాజ్… బెంగుళూరు మూడో విజయం