Mohit Sharma: నెట్ బౌలర్ నుండి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ విన్నర్ గా మోహిత్ శర్మ..!
ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ (Mohit Sharma) తన 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.
- Author : Gopichand
Date : 27-05-2023 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
Mohit Sharma: ఈ ఐపీఎల్ సీజన్‌లోని రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 62 పరుగుల తేడాతో ఓడించి గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండవ సీజన్‌కు ఫైనల్‌కు చేరుకుంది. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ (Mohit Sharma) తన 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు. 2022 సీజన్‌లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తయినప్పుడు ఏ జట్టు కూడా మోహిత్‌ను అందులో భాగంగా చేయలేదు. దీని తరువాత గత సీజన్ లో అతను గుజరాత్ టైటాన్స్ జట్టుకు నెట్ బౌలర్ పాత్రను పోషించాడు.
ఇప్పుడు ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అతనిని తమ ప్రధాన జట్టులో భాగంగా చేయాలని నిర్ణయించుకుంది. మోహిత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 13.54 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ జాబితాలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తర్వాత మోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత మోహిత్ శర్మ మాట్లాడుతూ.. నేను అలా బౌలింగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సూర్య, తిలక్ బ్యాటింగ్ చేసిన తీరు మాపై ఒత్తిడి పెంచింది. కానీ సూర్యని ఔట్ చేయడం ద్వారా మ్యాచ్‌ను పూర్తిగా మాకు అనుకూలంగా మార్చుకోగలిగాం అని తెలిపాడు.
Also Read: GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు
షమీ దగ్గర పర్పుల్ క్యాప్
మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అదే సమయంలో రషీద్ ఖాన్ 27 వికెట్లు తీసి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. మోహిత్ శర్మ రెండో క్వాలిఫయర్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు. పీయూష్ చావ్లా 22 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా, యుజ్వేంద్ర చాహల్ 21 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
గిల్ ఆరెంజ్ క్యాప్‌ని కైవసం చేసుకున్నాడు
ఆరెంజ్ క్యాప్‌పై ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్థానాన్ని గిల్ ముగించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో డుప్లెసిస్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐపీఎల్ 2023లో డుప్లెసిస్ 730 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 639 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, యశస్వి జైస్వాల్ 625 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. డెవాన్ కాన్వే 625 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.