సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్?!
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు.
- Author : Gopichand
Date : 17-03-2026 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. 19వ సీజన్ తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ సారథ్యం కోసం ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. అభిషేక్ శర్మను కాదని, టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ 27 ఏళ్ల యువ ఆటగాడు సన్‌రైజర్స్ కెప్టెన్ కాబోతున్నాడు.
SRH కొత్త సారథిగా ఇషాన్!
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఇషాన్ కెప్టెన్సీ అనుభవం విషయానికి వస్తే ఇటీవల ఆయన నాయకత్వంలో జార్ఖండ్ జట్టు తన తొలి ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ని గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా ఇషాన్ నిలిచాడు. SRH కెప్టెన్సీ రేసులో అభిషేక్ శర్మ పేరు కూడా వినిపించినప్పటికీ ఇషాన్ వారందరినీ వెనక్కి నెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా అభిషేక్ శర్మ ప్రస్తుతం పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: విజయ్–త్రిష రూమర్స్ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!
టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శన
దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్ 2026లో అదరగొట్టాడు. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిన ఇషాన్ భారత్ తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
- మ్యాచ్‌లు: 9
- పరుగులు: 317
- స్ట్రైక్ రేట్: 193
- సిక్సర్లు: 18
గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టులోకి చేరిన ఇషాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 35.40 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి.