India wins : భారత్ గెలుపు.. కాంగ్రెస్ నేత షామా ట్వీట్
India wins : ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కీలకమైన ఈ మ్యాచులో భారత ఆటగాళ్లు చక్కటి ప్రదర్శన కనబరిచారని, ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియాకు మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షించారు
- Author : Sudheer
Date : 05-03-2025 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్(Champions Trophy semi-final)లో టీమ్ ఇండియా (India ) అద్భుత విజయం సాధించిందని కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ (Congress leader Shama) ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కీలకమైన ఈ మ్యాచులో భారత ఆటగాళ్లు చక్కటి ప్రదర్శన కనబరిచారని, ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియాకు మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షించారు.
Reliance Industries: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కష్టాలు!
షామా మహమ్మద్ ట్వీట్‌లో టీమ్ ఇండియా విజయం మాత్రమే కాకుండా, విరాట్ కోహ్లి ప్రదర్శనకూ ప్రత్యేకమైన ప్రశంసలు అందించారు. “కీలక మ్యాచులో 84 పరుగులు చేయడంతో పాటు, ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచినందుకు అభినందనలు” అంటూ ఆమె పేర్కొన్నారు. విరాట్ ప్రదర్శన భారత విజయానికి కీలకమని, అతడి అద్భుత బ్యాటింగ్ వల్లే భారత్ గెలుపు సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల షామా మహమ్మద్ చేసిన మరో ట్వీట్ వివాదాస్పదమైంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసినందుకు ఆమె తీవ్ర విమర్శలకు గురయ్యారు. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన గొప్ప ఆటగాడని, ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు.
Mayuri Kango : ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన షామా మహమ్మద్, ఇప్పుడు భారత విజయంపై ట్వీట్ చేసి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. టీమ్ ఇండియా అభిమానులు ఆమె అభిప్రాయాన్ని స్వాగతించినప్పటికీ, రోహిత్ పై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ చేరిన నేపథ్యంలోఇప్పుడు అందరి దృష్టి ఆఖరి పోరుపై ఉంది.