IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ దిల్ ముందుగా బౌలింగ్ ఎందుకున్నాడు. దీంతో జింబాబ్వే జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు.
- By Praveen Aluthuru Published Date - 05:02 PM, Sat - 6 July 24

IND vs ZIM: హరారేలో భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ దిల్ ముందుగా బౌలింగ్ ఎందుకున్నాడు. దీంతో జింబాబ్వే జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లి టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయిన తర్వాత గిల్ సారధ్యంలో జరుగుతున్న తొలి సిరీస్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి గిల్ కెప్టెన్సీపైనే ఉంది. అదే సమయంలో స్వదేశంలో యువ జట్టు భారత్‌ను ఓడించేందుకు జింబాబ్వే ప్రయత్నిస్తుంది.
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: తాడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కయ్యా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మాడెండే (వికెట్), వెస్లీ మాధేవేర్, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా.
Also Read: Union Budget 2024 : 22 నుంచి పార్లమెంటు సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్