India vs UAE: 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ!
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకంగా మారారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కులదీప్ యాదవ్ కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
- By Gopichand Published Date - 09:33 PM, Wed - 10 September 25

India vs UAE: ఆసియా కప్ 2025లో తమ తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (India vs UAE) జట్టు కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. ఇది టీ20 ఆసియా కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌గా నమోదైంది. అలాగే టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
మ్యాచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టుకు ఆరంభం బాగానే లభించినా భారత బౌలర్ల వ్యూహాత్మక ప్రణాళికలు, కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన యూఏఈ ఆ తర్వాత కేవలం 31 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 10 వికెట్లను కోల్పోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
Also Read: Congress Govt : అన్నదాతలను నడి రోడ్డుపైకి ఈడ్చిన దుర్మార్గ పాలన – హరీష్ రావు
యూఏఈ ఓపెనర్లు అలీషాన్ షరాఫు 22 పరుగులు, కెప్టెన్ ముహమ్మద్ వసీం 19 పరుగులు చేసి మంచి పునాది వేశారు. అయితే వారిద్దరూ అవుటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. మిగతా 9 మంది బ్యాట్స్‌మెన్‌లలో అత్యధిక స్కోర్ రాహుల్ చోప్రా (3 పరుగులు) చేయడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన, భారత బౌలింగ్ దాడుల ముందు యూఏఈ ఎంతగా బలహీనపడిందో స్పష్టం చేసింది.
భారత బౌలర్ల సునామీ
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకంగా మారారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కులదీప్ యాదవ్ కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. మరోవైపు శివమ్ దూబే కూడా 2 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి తన అద్భుతమైన ఫామ్ చాటాడు. ఇక సీనియర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా తమ వంతుగా తలో ఒక వికెట్ తీశారు.