India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. భారత్ స్కోర్ ఎంతంటే?
అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో తన నాల్గవ అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అభిషేక్ కేవలం 31 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 8 ఫోర్లు, 2 సిక్స్‌లు వచ్చాయి.
- Author : Gopichand
Date : 26-09-2025 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
India vs Sri Lanka: ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా హవా శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీలంకతో జరిగిన సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు (India vs Sri Lanka) ఏకంగా 202 పరుగులు చేసింది. శ్రీలంకపై కూడా అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఆడాడు. కేవలం 31 బంతుల్లో 61 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ 23 బంతుల్లో 39 పరుగులు చేయగా, తిలక్ వర్మ 34 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు.
టాప్ ఆర్డర్ తడబాటు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శుభమన్ గిల్ విఫలమయ్యాడు. అతను మూడు బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ కూడా పెద్దగా ఆడలేదు. సూర్య 13 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read: America: భారత్‌లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
మెరిసిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్
అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో తన నాల్గవ అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అభిషేక్ కేవలం 31 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 8 ఫోర్లు, 2 సిక్స్‌లు వచ్చాయి. తిలక్ వర్మ 34 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇక సంజు శాంసన్ 23 బంతుల్లో 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్ ఒక ఫోర్, 3 సిక్స్‌లు బాదాడు.