India U19 Squad: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో వన్డే, టెస్టు సిరీస్‌లు..!
వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు కమాండ్‌ను మహ్మద్ అమన్‌కు అప్పగించారు. దీంతో పాటు వైస్ కెప్టెన్‌గా రుద్ర పటేల్‌ను నియమించారు.
- By Gopichand Published Date - 11:11 AM, Sat - 31 August 24

India U19 Squad: ఈరోజు BCCI.. ఆస్ట్రేలియా అండర్-19 (India U19 Squad) జట్టుతో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా కమాండ్ వేరే ఆటగాడి చేతిలో ఉండగా, టెస్టు సిరీస్‌కు మరో ఆటగాడిని టీమిండియా కెప్టెన్‌గా నియమించారు.
ఈ ఆటగాళ్లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు
వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు కమాండ్‌ను మహ్మద్ అమన్‌కు అప్పగించారు. దీంతో పాటు వైస్ కెప్టెన్‌గా రుద్ర పటేల్‌ను నియమించారు.
మహ్మద్ అమన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాఖ్, కార్తికేయ కెపి, కిరణ్ చోర్మలే, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహ, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్, రోహిత్ రాజావత్, మొహమ్మద్ అనన్.
Also Read: Bollywood Actress: రూ. 50 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసిన బాలీవుడ్ నటి..!
టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు
సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్యా, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), కార్తికేయ కెపి, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), చేతన్ శర్మ, సమర్థ్ ఎన్, ఆదిత్య కుమార్ రావత్ , అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మొహమ్మద్ అనన్.
రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్
భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 21 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
- మొదటి వన్డే (సెప్టెంబర్ 21)
- రెండో వన్డే (సెప్టెంబర్ 23)
- మూడో వన్డే (సెప్టెంబర్ 26)
We’re now on WhatsApp. Click to Join.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- మొదటి టెస్ట్ మ్యాచ్ (సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు)
- రెండవ టెస్ట్ మ్యాచ్ (అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 10 వరకు)