సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.
- Author : Gopichand
Date : 19-12-2025 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
- సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం
- 3-1తో టీ20 సిరీస్ కైవసం
- చివరి ఐదో టీ20లో 30 పరుగులతో టీమిండియా గెలుపు
India: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 19న జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. హార్దిక్ పాండ్యాతో పాటు తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో విరుచుకుపడి అర్ధసెంచరీ బాదారు. ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-1తో తన సొంతం చేసుకుంది.
భారీ స్కోరు సాధించిన భారత్
ఓపెనర్లు సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు మెరుపు వేగంతో 63 పరుగులు జోడించారు. సంజూ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 34 పరుగులు చేశారు. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల విధ్వంసం మొదలైంది. తిలక్ వర్మ 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా టీ20ల్లో భారత్ తరపున రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ (16 బంతుల్లో) సాధించి రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం 25 బంతుల్లో 63 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది.
8th CONSECUTIVE BILATERAL SERIES VICTORY FOR INDIA IN T20I. 🤯
– They are coming for the third T20I World Cup. pic.twitter.com/SnhGVE9oMt
— Johns. (@CricCrazyJohns) December 19, 2025
Also Read: అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!
దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు. ఇతర బ్యాటర్లలో హెండ్రిక్స్ 13 (12 బంతుల్లో), డెవాల్డ్ బ్రెవిస్ 31 (17 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ 18 (14 బంతుల్లో) పరుగులు చేశారు. అయితే భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
బౌలర్ల ప్రదర్శన
దక్షిణాఫ్రికా బౌలింగ్: కార్బిన్ బాష్ 3 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు.
భారత బౌలింగ్: భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.