HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Creates History

అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

  • Author : Gopi Date : 19-12-2025 - 9:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ పాండ్యా 63 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా.. అభిషేక్ శర్మ పేరిట ఉన్న ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టారు. ఇప్పుడు హార్దిక్ టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున అత్యంత వేగంగా అర్ధసెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నారు. తద్వారా ఈ ఏడాది ఇంగ్లాండ్‌పై 17 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అభిషేక్ శర్మను ఆయన అధిగమించారు. భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007లో ఇంగ్లాండ్‌పై యువీ కేవలం 12 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో యువరాజ్ 6 సిక్సర్లు కొట్టిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.

Also Read: జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

🚨 FASTEST FIFTY BY INDIAN BATTERS IN T20I HISTORY 🚨

Yuvraj Singh – 12 balls.

Hardik Pandya – 16* balls. pic.twitter.com/QU9z2lm6CR

— Johns. (@CricCrazyJohns) December 19, 2025

హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మల మెరుపు ఇన్నింగ్స్

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శామ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజూ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా, అభిషేక్ 21 బంతుల్లో 34 పరుగులు చేశారు.

హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

సిరీస్ పరిస్థితి

5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈరోజు అహ్మదాబాద్‌లో గెలిస్తే భారత్ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.

భారత్ తరపున T20Iలలో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీలు

  • 12 బంతుల్లో- యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ (2007)
  • 16 బంతుల్లో- హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా (2025)
  • 17 బంతుల్లో- అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్ (2025)
  • 18 బంతుల్లో- కె.ఎల్. రాహుల్, స్కాట్లాండ్ (2021)
  • 18 బంతుల్లో- సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా (2022)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fastest Fifty In T20
  • Hardik Pandya
  • Hardik Pandya Record
  • ind vs sa
  • sports news

Related News

Jofra Archer

షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కేకేఆర్ జట్టులో రింకూ సింగ్, అనుకుల్ రాయ్‌లు విజయంలో కీలక పాత్ర పోషించారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Gerald Coetzee

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో భారీ మార్పు!

  • Ajinkya Rahane

    వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!

Latest News

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd