Gautam Gambhir: మూడు ఫార్మెట్లో ఫిట్నెస్ తప్పనిసరి: గంభీర్
మూడు ఫార్మాట్లలో రాణించే ఆటగాళ్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. అయితే హార్దిక్ ఈ విషయంలో సేఫ్ అనే చెప్పాలి. పాండ్యా అద్భుతమైన ఆల్ రౌండర్, వన్డేలతో పాటు టీ20లోనూ తన సత్తాను నిరూపించుకున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 02:32 PM, Sat - 13 July 24

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ టీమిండియాను ఇంకా మీట్ అవ్వలేదు. కానీ గంభీర్ ఆటగాళ్ల ఫిట్నెస్ పై బిగ్ హింట్ ఇచ్చాడు. ఒక ఆటగాడు ఫిట్‌గా ఉండి మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటే ఆడొచ్చన్నాడు గౌతమ్ గంభీర్. ఎవరూ ఏ ఫార్మాట్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆటగాళ్లు తమ అవసరాలను బట్టి కాకుండా జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఆటగాళ్లను ఆలోచనలో పడేశాయి.
మూడు ఫార్మాట్లలో రాణించే ఆటగాళ్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. అయితే హార్దిక్ ఈ విషయంలో సేఫ్ అనే చెప్పాలి. పాండ్యా అద్భుతమైన ఆల్ రౌండర్, వన్డేలతో పాటు టీ20లోనూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అయితే హార్దిక్ టెస్టుల జోలికే వెళ్ళడు. అతను టెస్ట్ జట్టులో లేకపోవడం భారత జట్టు బౌలింగ్ మరియు మిడిల్ ఆర్డర్‌ను ఏదో ఒకవిధంగా బలహీనపరుస్తుంది. అతను టెస్టులు ఆడితే ఈ ఫార్మాట్‌లో జట్టు పటిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ను టెస్టుల్లోనూ రాణించేలా గంభీర్ ప్రత్యేక శ్రద్ద తీసుకునే అవకాశం ఉంది.
హార్దిక్ 11 టెస్టుల్లో 532 పరుగులు నమోదు చేశాడు. ఈ ఫార్మెట్లో పాండ్య 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 17 వికెట్లు కూడా పడగొట్టాడు. హార్దిక్ తన ఫిట్‌నెస్‌పై కసరత్తు చేసి టెస్టులు ఆడితే టీమిండియాకు మూడు ఫార్మెట్లలోనూ తిరుగులేకుండా పోతుంది. గౌతీ ఆలోచన కూడా అదేనని తెలుస్తుంది. అయితే మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యూహం గౌతమ్ గంభీర్ వ్యూహానికి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఆటగాళ్లు తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడం క్రికెటర్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇందుకోసం ద్రవిడ్ రొటేషన్ ఫార్ములాను అనుసరించాడు. ద్రవిడ్ జట్టును బట్టి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేవాడు. రాహుల్ ద్రవిడ్ హయాంలో రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి ఆటగాళ్లు చిన్న జట్లతో ఆడలేదు. గాయం నుంచి ఆటగాళ్లను రక్షించడమే దీని ఉద్దేశం. అయితే గంభీర్ మైండ్ సెట్ అలా ఉండదు. మూడు ఫార్మెట్లలో ఆడుతూనే ఫిట్ గా ఉండాలంటాడు. ఏదేమైనప్పటికీ త్వరలో టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అర్ధం అవుతుంది.
Also Read: Congress vs BRS : బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం.?