IND vs SL Tour: సూర్య వర్సెస్ రోహిత్
శ్రీలంకతో మరికాసేపట్లో వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ని రోహిత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:26 PM, Fri - 2 August 24

IND vs SL Tour: శ్రీలంకతో జరిగిన టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కాన్ఫిడెంట్ గా ఉన్న టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది. మరికాసేపట్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే సిరీస్ ని విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్లు తిరిగి రావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.
హెడ్ కోచ్ గంభీర్ కూడా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగానే జట్టు కూర్పు ఉండొచ్చంటున్నారు.టీమిండియా శ్రీలంక మధ్య ఇప్పటివరకు 246 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 142 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే ఇరు జట్ల మధ్య 2 వన్డే మ్యాచ్‌లు టై అయ్యాయి.17 మ్యాచ్‌లు డ్రా కాగా, 12 మ్యాచ్‌లు అసంపూర్తిగా నిలిచాయి. శ్రీలంక గడ్డపై భారత్-శ్రీలంక మధ్య ఇప్పటివరకు 66 వన్డేలు జరిగాయి. అందులో భారత్ 32 మ్యాచ్‌లు, శ్రీలంక 28 మ్యాచ్‌లు గెలిచింది. 6 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ మైదానంలో ఇరు జట్లు ఇప్పటి వరకు 38 వన్డే మ్యాచ్‌లు ఆడాయి.అందులో టీమిండియా 19 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. సో భారత్‌ను ఓడించడం శ్రీలంకకు అంత సులువు కాదని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మరి తొలి వన్డేలో ఎవరు పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Also Read: Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా