HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Sa India Loss The Match Sa Win By 4 Wickets

IND vs SA: రెండో వన్డేలో భారత్‌కు పరాజయం.. దక్షిణాఫ్రికా రికార్డు ఛేదన!

అయితే వారిద్దరి శతకాలు కూడా వృథా అయ్యాయి. ఎందుకంటే 110 పరుగులు చేసిన ఐడెన్ మార్క్రమ్ ఒక్కడే కోహ్లీ, గైక్వాడ్‌పై భారీగా పైచేయి సాధించాడు. అలాగే డెవాల్డ్ బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులతో చేసిన మెరుపు ఇన్నింగ్స్ కూడా భారత బౌలర్లకు ఇబ్బంది కలిగించింది.

  • Author : Gopichand Date : 03-12-2025 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs SA
IND vs SA

IND vs SA: దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ (IND vs SA)ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ శతకాల సహాయంతో 358 పరుగుల భారీ స్కోరును నిర్మించింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా చివరి ఓవర్ వరకు పోరాడి ఇంకా 4 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది.

భారత గడ్డపై విదేశీ జట్టు వన్డేల్లో ఛేదించిన అతిపెద్ద స్కోరు ఇదే. గతంలో ఆస్ట్రేలియా కూడా 2019లో భారత్‌పై 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా 359 పరుగులను ఛేదించి, ఈ విషయంలో ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికి ఫీల్డింగ్ లోపాలు కూడా ఒక కారణంగా నిలిచాయి. భారత ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడిచారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా పలుమార్లు మిస్‌ఫీల్డ్ చేశారు. బ్యాటింగ్‌లో కూడా టీమ్ ఇండియా బలహీనతలు బయటపడ్డాయి. జట్టు సులభంగా 380-390 స్కోరుకు చేరుకోగలిగేది. కానీ భారత బ్యాట్స్‌మెన్ చివరి 10 ఓవర్లలో కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Also Read: Bhuta Shuddhi Vivaham: సమంత ‘భూత శుద్ధి వివాహం’ ఎందుకు చేసుకున్నారో తెలుసా?

కోహ్లీ-గైక్వాడ్ శతకాలు వృథా

ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 721 పరుగులు వచ్చాయి. భారత్- దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లలో కలిపి 3 శతకాలు నమోదయ్యాయి. టీమ్ ఇండియా తరఫున విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 53వ శతకంగా 102 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 77 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది భారత్ తరఫున వన్డేలలో వేగవంతమైన శతకాలలో ఒకటిగా నిలిచింది.

అయితే వారిద్దరి శతకాలు కూడా వృథా అయ్యాయి. ఎందుకంటే 110 పరుగులు చేసిన ఐడెన్ మార్క్రమ్ ఒక్కడే కోహ్లీ, గైక్వాడ్‌పై భారీగా పైచేయి సాధించాడు. అలాగే డెవాల్డ్ బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులతో చేసిన మెరుపు ఇన్నింగ్స్ కూడా భారత బౌలర్లకు ఇబ్బంది కలిగించింది.

భారత్‌పై వన్డేలలో అతిపెద్ద రన్ ఛేజ్‌లు

  • దక్షిణాఫ్రికా- 359 (2025)
  • ఆస్ట్రేలియా- 359 (2019)
  • న్యూజిలాండ్- 348 (2020)
  • ఇంగ్లాండ్- 337 (2021)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aiden Markram
  • ind vs sa
  • India vs south africa
  • Ruturaj Gaikwad
  • sports news
  • virat kohli

Related News

Most Centuries

సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.

  • Shreyas Iyer

    శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

  • Vijay Hazare Trophy

    విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

  • Shubman Gill

    టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

  • RCB Star

    ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

Latest News

  • 2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?

  • బంగ్లాదేశ్‌ కోసం.. మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్రణాళిక ఉంది: తారిక్ రహమాన్

  • గుడ్లు క్యాన్సర్​కు కారణమవుతాయా? ..FSSAI చేసిన సంచలన ప్రకటన ఏంటి?

  • మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?..భావనల మధ్య తేడా ఏమిటి?

  • అనంత విశ్వానికి మూలమైన అమ్మవారి (dasa mahavidya) దశ మహా విద్యలు ఇవే!

Trending News

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

    • బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd