IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
- By Praveen Aluthuru Published Date - 07:33 PM, Tue - 26 December 23

IND vs SA 1st Test: సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణతో టీమిండియా 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇక యశస్వి జైస్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (2)లు కూడా అవుటైన వెంటనే టీమిండియా 24 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31) కాసేపటికి పెవిలియన్ చేరారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
లంచ్ విరామం తర్వాత టీమ్ ఇండియాకు మరోసారి కష్టాలు ఎదురయ్యాయి. లంచ్ విరామం తర్వాత రబాడ వేసిన తొలి ఓవర్‌లో అయ్యర్ ఔటయ్యాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆపై నిలకడగా ఆడుతున్న కోహ్లి (38)ని రబాడ పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (8) ,శార్దూల్ ఠాకూర్ (24 ) పరుగులు చేశారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. అయితే రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. రాహుల్ కాస్త స్టాండ్ ఇస్తే కనీస టార్గెట్ ఇవ్వొచ్చు. దీంతో అతనిపైనే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది.
Also Read: Pistachios Benefits : ఆ వ్యాధిగ్రస్తులు చలికాలంలో పిస్తా తీసుకుంటే చాలు.. ఎన్నో ప్రయోజనాలు..