IND vs PAK: ఒకవేళ భారత్, పాక్ మ్యాచ్ టై అయితే.. విజేతను ఎలా ప్రకటిస్తారు?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది.
- Author : Gopichand
Date : 23-02-2025 - 6:21 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK: అందరి చూపు టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ పాకిస్థాన్‌పై భారత్‌దే (IND vs PAK) పైచేయి. ఛాంపియన్స్ ట్రోఫీలో విజయంతో టీమిండియా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లోనూ భారతే విజయానికి ప్రధాన పోటీదారుగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందా అని అందరూ చూస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మ్యాచ్ టై అయితే ఏమవుతుంది? ఏ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితం నిర్ణయించబడుతుంది? ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు ఇస్తారు? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాచ్ ఫలితం ఎలా తెలుస్తుంది?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది. ఐసీసీ రూపొందించిన నిబంధనల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదైనా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒక సూపర్ ఓవర్ నుండి ఫలితం సాధించకపోతే, మరొక సూపర్ ఓవర్ ఉంటుంది. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్ల క్రమం ఇలాగే కొనసాగుతుంది.
Also Read: Clay Pot Water Benefits: వేసవికాలంలో కుండనీరు ఎందుకు తాగాలి.. దానివల్ల లాంటి లాభాలు కలుగుతాయి?
నాకౌట్ కోసం రిజర్వ్ డే
టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే కూడా ఉంచారు. వర్షం లేదా మరేదైనా కారణాల వల్ల మ్యాచ్ నిర్వహించలేకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. మ్యాచ్ ఫలితం పొందడానికి బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 25 ఓవర్లు ఆడాలి. ఇందుకోసం గ్రూప్ దశలో 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇది కాకుండా గ్రూప్ దశలో ఏదైనా మ్యాచ్ ఫలితం రాకపోతే ఇరు జట్లకు సమాన పాయింట్లు ఇవ్వబడతాయి.