Clay Pot Water Benefits: వేసవికాలంలో కుండనీరు ఎందుకు తాగాలి.. దానివల్ల లాంటి లాభాలు కలుగుతాయి?
వేసవికాలంలో కుండలోని నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:39 PM, Sun - 23 February 25

నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో నీరు త్రాగడం చాలా ముఖ్యం. నీరు తాగకపోతే డిహైడ్రేషన్ అలసట వంటి సమస్యలు వస్తాయి. అందుకే మిగతా సీజన్లతో పోల్చుకుంటే సమ్మర్ లో ఇంకా ఎక్కువ నీటిని తాగాలని చెబుతూ ఉంటారు. ఎండలు బాగా మండిపోతున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలోని నీరు ఇంకా ఎంతో మేలు చేస్తాయట. ఫ్రిజ్లో నీరు తాగకూడదని కుండలో నీరు తాగడం వల్ల అనేక రకాల లాభాలు కూడా కలుగుతాయట.
కుండలోని నీరు సహజంగానే చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిజ్ లోని వాటర్ కంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు వస్తాయట. కానీ కుండ నీరు తాగితే ఎలాంటి సమస్యలు రావు. అలాగే అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయట. ముఖ్యంగా వేసవి కాలంలో మనకు ఎక్కడైనా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడకు వెళ్లి ఆ కుండలోని నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరానికి చాలా మంచిదట. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. తద్వారా వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుందని చెబుతున్నారు.
కుండ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, వేడి చేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. అదే ఫ్రిజ్ లోని వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటివి త్వరగా ఎటాక్ చేస్తాయని చెబుతున్నారు. మట్టి కుండలోని నీటిని తాగితే ఈ సమస్యలు దూరం అవుతాయట. కాగా మాములుగా కుండలను బంక మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇవి సహజంగానే ఆల్కలీన్ కాబట్టి ఇందులో నిల్వ చేసిన నీరు పీహెచ్ లెవల్స్ కంటే బ్యాలెన్స్ గా ఉంటాయట. కాబట్టి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయని, ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే మల బద్ధకం వంటి సమస్య కూడా తగ్గుతుందట. సాధారణ నీటి కంటే కుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవట. మట్టికుండ నీటిలోని సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయట. కాబట్టి ఈ నీటిలో వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉండవు. జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందట.