IND vs ENG: బుమ్రా బౌలింగ్‌లో జైస్వాల్ మిస్టేక్.. సెంచరీ కొట్టిన ఓలీ పోప్!
జస్‌ప్రీత్ బుమ్రా ఓలీ పోప్‌ను దాదాపు తన బౌలింగ్‌లో ఔట్ చేసేతం పని చేశాడు. కానీ స్లిప్‌లో నిలబడిన యశస్వీ జైస్వాల్ పొరపాటు చేశాడు. పోప్ క్యాచ్ జారవిడిచాడు.
- By Gopichand Published Date - 10:49 AM, Sun - 22 June 25

IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లీడ్స్‌లో జరగుతోంది. ఈ మ్యాచ్ రెండవ రోజు టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్ అద్భుతమైన సెంచరీలు సాధించారు. ఆ తర్వాత బౌలింగ్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ 4 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. అనంతరం ఓలీ పోప్, బెన్ డకెట్ మధ్య 122 పరుగుల భాగస్వామ్యం కనిపించింది. ఇంగ్లాండ్‌కు మొదటి రోజు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఫీల్డింగ్, బౌలింగ్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్ల నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి.
ఓలీ పోప్ సెంచరీ
రెండవ రోజు ఇంగ్లాండ్ తరఫున అద్భుత బ్యాటింగ్ చేసిన ఓలీ పోప్ సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా ఓలీ పోప్‌ను దాదాపు తన బౌలింగ్‌లో ఔట్ చేసేతం పని చేశాడు. కానీ స్లిప్‌లో నిలబడిన యశస్వీ జైస్వాల్ పొరపాటు చేశాడు. పోప్ క్యాచ్ జారవిడిచాడు. ఓలీ పోప్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు జైస్వాల్ అతని క్యాచ్ వదిలేశాడు. దీంతో బుమ్రా కాస్త అసంతృప్తిగా కనిపించాడు. ఆ తర్వాత పోప్ తన సెంచరీ పూర్తి చేశాడు.
Also Read: Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం?
జస్‌ప్రీత్ బుమ్రా నో బాల్
రెండవ రోజు చివరి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. అందులో అతను మూడు నో బాల్స్ వేశాడు. ఈ ఓవర్‌లో జస్‌ప్రీత్‌కు హ్యారీ బ్రూక్ వికెట్ దొరికి ఉండేది. బుమ్రా అద్భుతమైన బౌన్సర్‌పై హ్యారీ క్యాచ్‌ను మహ్మద్ సిరాజ్ పట్టుకున్నాడు. కానీ అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో హ్యారీ బ్రూక్‌కు మరో అవకాశం లభించింది.
THE MASTERCLASS SPELL OF 13-2-48-3 BY JASPRIT BUMRAH. 🐐pic.twitter.com/JXHjR5o3sV
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 22, 2025
ఒకవేళ టీమ్ ఇండియాకు ఈ రెండు వికెట్లు దొరికి ఉంటే.. రెండవ రోజే ఇంగ్లాండ్ జట్టు సగం పెవిలియన్‌కు చేరుకుని ఉండేది. టీమ్ ఇండియా మ్యాచ్‌పై పట్టు మరింత బలపడి ఉండేది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టంతో 209 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓలీ పోప్ 100 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అయితే హ్యారీ బ్రూక్ ఇంకా ఖాతా తెరవాల్సి ఉంది.