IND vs ENG: జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జైస్వాల్, రోహిత్ అవుట్
ఆండర్సన్ తొలి సెషన్‌లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆండర్సన్ ఆ వెంటనే డబుల్ సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ ని పెవిలియన్ చేర్చాడు.
- By Praveen Aluthuru Published Date - 10:31 AM, Sun - 4 February 24

IND vs ENG: విశాఖపట్నం టెస్టులో తొలి రెండు రోజులు పట్టు బిగించిన భారత్ మూడో రోజు తడబడింది. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ అద్భుత బౌలింగ్ ముందు టీమిండియా ఓపెనర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆండర్సన్ తొలి సెషన్‌లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆండర్సన్ ఆ వెంటనే డబుల్ సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ ని పెవిలియన్ చేర్చాడు.
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు భారత్ 336 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకు కుప్పకూలింది. రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ 396 పరుగుల వద్ద ముగిసింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 209 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది జైస్వాల్ టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్. కాగా ఈ రోజు మొదలైన రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ వేసిన బంతిని సిక్సర్ కొట్టడంతో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
నిన్న ఇంగ్లాండ్ బ్యాటర్లపై జస్ప్రీత్ బుమ్రా ఓ రేంజ్ లో విరుచుకు పడ్డాడు. 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను చావు దెబ్బ కొట్టాడు. బుమ్రా తన స్వింగ్ మాయాజాలంతో ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన. బుమ్రా వేసిన ఓలీ పోప్ వికెట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు మొత్తం 253 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది.
Also Read: Urvasi Rautela : ఊర్వశి కేవలం పాటకే కాదట.. బాలయ్య సినిమాలో అమ్మడు కెవ్వు కేక పెట్టిస్తుందా..?