Kanpur Pitch And Weather Report: రేపే టీమిండియా వర్సెస్ బంగ్లా రెండో టెస్టు.. పిచ్, వెదర్ రిపోర్టు ఇదే..!
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 10:12 PM, Thu - 26 September 24

Kanpur Pitch And Weather Report: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ రేపటి నుంచి (సెప్టెంబర్ 27) కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ (Kanpur Pitch And Weather Report) స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో ముందంజలో ఉంది. అయితే రేపు జరగబోయే రెండు టెస్టులో ఎలాగైనా టీమిండియాకు పోటీ ఇవ్వాలని బంగ్లా జట్టు చూస్తోంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మొదటి టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ కూడా గెలిచి టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు కాన్పూర్ పిచ్, వాతావరణాన్ని తెలుసుకుందాం.
వర్షం మ్యాచ్‌కు ఆటంకం కానుందా..?
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. శుక్రవారం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడవచ్చు. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ రెండో రోజు (సెప్టెంబర్ 28) కూడా వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పూర్ టెస్టు ఎలా జరుగుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Devara Overseas Talk : అదొక్కటే మైనస్ తప్ప ..సినిమా బ్లాక్ బస్టర్
కాన్పూర్ పిచ్ రిపోర్టు
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం కాన్పూర్‌లో రెండు నల్ల మట్టి పిచ్‌లను సిద్ధం చేశారు. మ్యాచ్ ఏ పిచ్‌పై జరుగుతుందో ఇంకా తెలియరాలేదు. అయితే బ్యాటింగ్‌కు ఉపరితలం అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆట సాగుతున్న కొద్దీ బౌలర్లకు తక్కువ బౌన్స్ లభిస్తోంది. మ్యాచ్ మూడో రోజు నుంచి బంతి తిరగడం ప్రారంభమవుతుంది. కాన్పూర్ పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్-బంగ్లాదేశ్‌ల ప్లేయింగ్-ఎలెవన్‌లో అదనపు స్పిన్నర్ కనిపించవచ్చు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, యష్ దయాల్.