Suryansh Shedge: నేడు గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్.. యువ ఆల్ రౌండర్ అరంగేట్రం?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఒక అద్భుతమైన ఆల్ రౌండర్‌ను కేవలం రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అతనిని తదుపరి హార్దిక్ పాండ్యా అని కూడా పిలుస్తున్నారు.
- By Gopichand Published Date - 01:23 PM, Tue - 25 March 25

Suryansh Shedge: ఐపీఎల్ 2025 సీజన్-18 ఐదవ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి చాలా బలంగా కనిపిస్తోంది. జట్టు కమాండ్ శ్రేయాస్ అయ్యర్ చేతిలో ఉంది. గత సీజన్‌లో అతని కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈసారి పంజాబ్ కింగ్స్‌కు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను అందజేసే పెద్ద బాధ్యత అయ్యర్‌పై ఉంది.
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఒక అద్భుతమైన ఆల్ రౌండర్‌ను కేవలం రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అతనిని తదుపరి హార్దిక్ పాండ్యా అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ ఆటగాడికి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.
సూర్యన్ష్ షెడ్జ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇస్తారా?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 30 లక్షలకు సూర్యన్ష్ షెడ్జ్‌ని (Suryansh Shedge) కొనుగోలు చేసింది. దేశీయ సీజన్ సూర్యన్ష్ షెడ్జ్‌కి అద్భుతంగా ఉంది. ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫినిషర్‌గా మంచి పాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌లు ఆడి 131 పరుగులు చేశాడు. ఇది కాకుండా బౌలింగ్‌లో సూర్యన్ష్ షెడ్జ్ 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అతన్ని టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పోల్చడం మొదలుపెట్టారు అభిమానులు.
Also Read: KL Rahul: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. తండ్రి అయిన స్టార్ క్రికెటర్!
అయ్యర్.. అతనికి అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వగలడా?
శ్రేయాస్ అయ్యర్‌కి ఈ ఆటగాడి గురించి బాగా తెలుసు. అతని సామర్థ్యాన్ని గుర్తించాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయ్యర్ కెప్టెన్సీలో సూర్యన్ష్ షెడ్జ్ ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో అయ్యర్ ఈ ఆటగాడికి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వగలడని భావిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు అంచనా
- శ్రేయాస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యన్ష్ షెడ్జ్, మార్కో జాన్సన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.