Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాక్ జట్లకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఈ జట్టు పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌ను డ్రా చేసింది.
- By Gopichand Published Date - 11:07 PM, Thu - 15 May 25

Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడవ సైకిల్ (2023-25) ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 11 నుంచి క్రికెట్ మక్కా అయిన లార్డ్స్‌లో జరగనుంది. పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తమ టైటిల్‌ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా.. టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు టైటిల్ కరువును అంతం చేయడానికి రంగంలోకి దిగనుంది.
ఐసీసీ ప్రైజ్ మనీ ప్రకటన
WTC 2023-25 కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రైజ్ మనీ (Prize Money) వివరాలను ప్రకటించింది. ఈ సైకిల్‌లో 9 జట్ల మధ్య మొత్తం 5.76 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 49.27 కోట్ల రూపాయలు) బహుమతి రూపంలో పంపిణీ చేయబడతాయి. ఇది మునుపటి రెండు ఎడిషన్‌లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ సారి ఛాంపియన్ జట్టుకు 3.6 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 30.80 కోట్ల రూపాయలు) బహుమతిగా లభిస్తుంది. ఇది 2021, 2023లో ఇచ్చిన 1.6 మిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ.
రన్నరప్ జట్టుకు 2.16 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 18.48 కోట్ల రూపాయలు) లభిస్తాయి. గతంలో రన్నరప్‌కు 80,000 డాలర్లు మాత్రమే లభించాయి. మూడవ స్థానంలో నిలిచిన భారత జట్టుకు 1,440,000 డాలర్లు (సుమారు 12.32 కోట్ల రూపాయలు) బహుమతి లభిస్తుంది. నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు సుమారు 10.27 కోట్ల రూపాయలు (1,200,000 డాలర్లు) లభిస్తాయి. ఇంగ్లండ్ (సుమారు 8.2 కోట్ల రూపాయలు), శ్రీలంక (సుమారు 7.19 కోట్ల రూపాయలు), బంగ్లాదేశ్ (సుమారు 6.16 కోట్ల రూపాయలు), వెస్టిండీస్ (సుమారు 5.14 కోట్ల రూపాయలు), పాకిస్తాన్ (సుమారు 4.11 కోట్ల రూపాయలు) జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది.
Also Read: Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
జట్ల ప్రదర్శన
దక్షిణాఫ్రికా WTC 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జట్టు పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌ను డ్రా చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌పై 3-1 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కంగారూ జట్టు పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై 3-0 తేడాతో ఓడించింది. అలాగే న్యూజిలాండ్, శ్రీలంకపై కూడా సిరీస్‌లను గెలుచుకుంది.
WTC 2023-25 ప్రైజ్ మనీ వివరాలు
- విజేత: 30.80 కోట్లు
- రన్నరప్: 18.48 కోట్లు
- భారత్ (3వ స్థానం): 12.33 కోట్లు
- న్యూజిలాండ్ (4వ స్థానం): 10.27 కోట్లు
- ఇంగ్లండ్: 8.2 కోట్లు
- శ్రీలంక: 7.19 కోట్లు
- బంగ్లాదేశ్: 6.16 కోట్లు
- వెస్టిండీస్: 5.14 కోట్లు
- పాకిస్తాన్: 4.11 కోట్లు