ICC: అమెరికాలో టీ20 ప్రపంచకప్.. ఐసీసీకి రూ. 160 కోట్ల నష్టం..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 T20 ప్రపంచ కప్‌ను అమెరికా- వెస్టిండీస్‌లో సంయుక్తంగా నిర్వహించింది.
- By Gopichand Published Date - 01:15 PM, Thu - 18 July 24

ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 T20 ప్రపంచ కప్‌ను అమెరికా- వెస్టిండీస్‌లో సంయుక్తంగా నిర్వహించింది. తొలిసారిగా అమెరికాలో ఇంత పెద్ద క్రికెట్ ఈవెంట్ జరిగింది. అయితే ఐసీసీకి అమెరికాలో టి20 ప్రపంచకప్ నిర్వహించడం చాలా ఖరీదైనదిగా మారింది. ఇక్కడ టీ20 ప్రపంచకప్ నిర్వహించడం ద్వారా ఐసీసీకి రూ.160 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్య ఇది విఫలమైంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. 2024 T20 ప్రపంచ కప్‌కు అమెరికాను హోస్ట్‌గా చేయడం ICCకి చాలా ఖరీదైనదిగా నిరూపించబడింది. ఇక్కడి నుంచి ఐసీసీకి రూ.160 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. T20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ అమెరికాలో మాత్రమే జరిగాయి. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరిగింది. ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికాలో తాత్కాలిక నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. అది తర్వాత కూల్చివేసిన విషయం తెలిసిందే.
అయితే అమెరికాలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. భారత్, పాకిస్థాన్ సహా పలు జట్లు అమెరికాలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి అనేక జట్లు వెస్టిండీస్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాయి. గ్రూప్ దశ తర్వాత సూపర్-8, సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. అయితే ఈ చారిత్రాత్మక ప్రపంచకప్ ఐసిసికి నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పెద్ద దెబ్బ తగిలింది.
Also Read: Zaheer Khan: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ విజేతగా టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించి ఐసీసీ టీ20 ప్రపంచకప్ విన్నర్‌గా నిలిచింది. దీంతో టీమిండియా ఐసీసీ కల నేరవెరింది. ఈ ప్రపంచకప్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజాలు టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.