Hardik Pandya: నటాషా దెబ్బకు భారీగా ఆస్తులు పొగొట్టుకున్న పాండ్యా..?
సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అధికారికంగా విడాకులు తీసుకున్నాడు.
- By Gopichand Published Date - 08:49 AM, Sat - 20 July 24

Hardik Pandya: సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అధికారికంగా విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు విడాకులు ధృవీకరించిన కొద్ది గంటల తర్వాత నటాషా తన కొడుకు అగస్త్య ఆడుకుంటున్న వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నటాషా సెర్బియాలోని తన ఇంటికి చేరుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఆమె కుమారుడు అగస్త్య బంతితో ఆడుకుంటూ కనిపించాడు. అగస్త్య వీడియోను పంచుకోవడమే కాకుండా నటాషా కొన్ని చిత్రాలను కూడా పంచుకుంది. చేతిలో 11 కేజీల పుచ్చకాయతో ఫొటో దిగింది. నటాషా సైక్లింగ్, జిమ్‌లో వ్యాయామం చేస్తున్న చిత్రాన్ని కూడా పంచుకుంది. దీనికి ముందు నటాషా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగస్త్యతో కనిపించింది. అక్కడ ఆమె మీడియా వ్యక్తులను తప్పించుకుంటూ ముంబై ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళింది.
హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నట్లు ధృవీకరించారు
హార్దిక్- నటాషా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే విధమైన ప్రకటనను విడుదల చేశారు. దాని ద్వారా వారు వివాహం చేసుకున్న 4 సంవత్సరాల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైందన్నారు. 4 ఏళ్ల కుమారుడు అగస్త్య విషయానికి వస్తే అతను ప్రస్తుతం సెర్బియాలో నటాషాతో ఉన్నాడు. అయితే అగస్త్య జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి వారిద్దరూ అన్ని విధాలా ప్రయత్నిస్తారని హార్దిక్, నటాషా తెలిపారు.
Also Read: Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు
హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ మే 2020లో మొదటిసారిగా పెళ్లి చేసుకున్నారని మనకు తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ చూస్తే ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 2023 లో వారిద్దరూ మరోసారి తమ సంబంధానికి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈసారి హిందూ, క్రిస్టియన్ మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అప్పటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్. రెండోసారి పెళ్లి చేసుకున్న సంవత్సరంలోపే పాండ్యా- నటాషా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వీళ్లిద్దరూ విడిపోవటానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
We’re now on WhatsApp. Click to Join.
పాండ్యాకు భారీగా లాస్
హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇవ్వటం వలన సంపాదించిన దాంట్లో భారీగా భరణం ఇవ్వాల్సి వచ్చిందని పలు కథనాలు వెలువడ్డాయి. 2024 లెక్కల ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యా నికర విలువ సుమారు రూ.95 కోట్లుగా ఉంది. ఈ మేరకు నటాషా.. హార్దిక్ నుంచి భారీగా భరణం పొందినట్లు తెలుస్తోంది. భరణం విలువ రూ. 30-40 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.