Kapil Dev: హార్దిక్ ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేసిన కపిల్ దేవ్
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. గాయం కారణంగా తమ కీలక ఆటగాళ్లు దూరం కాకపోతే భారత జట్టు మరింత పటిష్టంగా
- By Praveen Aluthuru Published Date - 04:30 PM, Thu - 29 June 23

Kapil Dev: స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. గాయం కారణంగా తమ కీలక ఆటగాళ్లు దూరం కాకపోతే భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుందని అన్నాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ “ప్రతి క్రీడాకారుడి జీవితంలో గాయాలు సహజం. హార్దిక్ పాండ్యా గురించి నేను ఎప్పుడూ ఆందోళన చెందుతాను. హార్దిక్ త్వరగా గాయపడతాడు. అసలు ఆటగాళ్లు తమ ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తే ప్రపంచంలోనే భారత్ జట్టు లాంటి మరో జట్టు ఉండదని అభిప్రాయపడ్డారు కపిల్ దేవ్.
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మరియు జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వచ్చే ప్రపంచకప్‌లోపు తమ కీలక ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావాలని భారత జట్టు కోరుకుంటోంది. అయితే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత హార్దిక్ పాండ్యా కాస్త విరామం తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ IPL 2023 ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల ఓటమిని చవిచూసింది. హార్దిక్ పాండ్యా ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకు సిద్దమవుతున్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది, ఇందులో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దీని తర్వాత వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండనున్నట్టు సమాచారం. కాగా వెస్టిండీస్ టూర్‌లో టీ20 అంతర్జాతీయ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
Read More: cancer pregnancy: 15 బాలిక ప్రెగ్నెంట్.. డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఊహించని షాక్?